కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌.. ర్యాలీ భళా!

కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌.. ర్యాలీ భళా!

వ్యాపార పునర్విభజన అంచనాలతో ఇటీవల జోరందుకున్న కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ మరోసారి సందడి చేస్తోంది. డిసెంబర్‌కల్లా టైర్ల తయారీ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసే యోచనలో ఉన్నట్లు వెలువడ్డ వార్తలు గత కొద్ది రోజులుగా కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు కిక్‌నిస్తున్నాయి. ఈ బాటలో ఇన్వెస్టర్లు మరోసారి కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసింది. రూ. 97 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 99ను సైతం అధిగమించింది.

Image result for share rallied

ఇతర వివరాలు ఇవీ
నష్టాలలో నడుస్తున్న టైర్ల తయారీ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీయనున్న అంచనాలు, ఈ ఏడాది రెండో క్వార్టర్‌ ఫలితాల విడుదల నేపథ్యంలో కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ గత మూడు వారాలుగా ర్యాలీ చేస్తోంది. నవంబర్‌ 13 నుంచీ ఈ షేరు 65 శాతం దూసుకెళ్లింది. వెరసి రూ. 60 నుంచి రూ. 97కు చేరింది. కాగా.. బీకే బిర్లా గ్రూప్‌ సంస్థ అయిన కేశొరామ్‌ క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో దాదాపు రూ. 10 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ ప్రధానంగా సిమెంట్‌, టైర్ల తయారీలో ఉంది. వీటితోపాటు రేయాన్‌ యార్న్‌, హెవీ కెమికల్స్‌, స్పన్‌ పైప్స్‌ తదితర ప్రొడక్టులనూ రూపొందిస్తోంది. అయితే కంపెనీ యాజమాన్యం టైర్ల విభాగాన్ని విడదీస్తున్నట్లు వెలువడ్డ వార్తలను తిరస్కరిస్తోంది. కాగా.. విదేశీ భాగస్వామికి చోటుకల్పించడం ద్వారా టైర్ల తయారీ విభాగాన్ని పటిష్టపరచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.Most Popular