ఏషియన్‌ గ్రానైటొ- హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్లస్‌

ఏషియన్‌ గ్రానైటొ- హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్లస్‌

నాన్‌ప్రమోటర్‌ సంస్థలకు వారంట్ల జారీ వార్తలతో ఏషియన్‌ గ్రానైటొ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దృష్టిసారించడంతో లాభాలతో కళకళలాడుతోంది. మరోపక్క విదేశీ దిగ్గజంతో వ్యూహాత్మక ఒప్పందాన్ని పొడిగించుకున్న వార్తలతో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కౌంటర్ బలపడింది. వివరాలు చూద్దాం...

ఏషియన్‌ గ్రానైటొ
ప్రమోటరేతర సంస్థలు శాంటారియో సిరామిక్స్‌, ఆగ్జెంటో సిరామిక్స్‌కు షేర్లుగా మార్చుకునేందుకు వీలయ్యే వారంట్ల జారీకి బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఏషియన్‌ గ్రానైటొ తాజాగా పేర్కొంది. ఒక్కో వారంట్‌నూ రూ. 245 ధరలో జారీ చేయనున్నట్లు తెలియజేసింది. మొత్తం 20 లక్షల వారంట్లను ఇష్యూ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.6 శాతం జంప్‌చేసి రూ. 205 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 210 వరకూ ఎగసింది.

Image result for hcl technologies

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
విదేశీ దిగ్గజం బార్‌క్లేస్‌కు ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ సేవలందిస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసులలో భాగస్వామిగా వ్యవహరించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు నష్టాల మార్కెట్లోనూ ఊపందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం పెరిగి రూ. 1039 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1043 వరకూ ఎగసింది. డిజిటల్‌ వర్క్‌ప్లేస్‌ సర్వీసులలో ప్రధానంగా బార్‌క్లేస్‌తో కలసి ఐటీ మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ పేర్కొంది. Most Popular