మార్కెట్ సానుకూల పవనాలు-మరో రెండు వారాల్లో ఈ స్టాక్స్‌కు లాభాలు..!

మార్కెట్ సానుకూల పవనాలు-మరో రెండు వారాల్లో ఈ స్టాక్స్‌కు లాభాలు..!

గత కొద్ది వారాలుగా సెన్సెక్స్ పుంజుకోడం, రూపీ బలపడటం, మరియు తాజాగా అమెరికా,చైనాల మధ్య ట్రేడ్ వార్ కు విరామం ప్రకటించడంతో మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ సోమవారం నాడు పై వాటి ప్రభావంతో బ్యాంకింగ్, మెటల్, FMCG రంగాలు వేగంగా పుంజుకున్నాయి. నిఫ్టీ , సెన్సెక్స్ లు ఇంట్రాడేలో కొద్దిగా ఒడిదిడులుకు చూసినా, మార్కెట్ క్లోజింగ్ కల్లా స్థిరపడ్డాయి. ఎనలిస్టుల అంచనా మేరకు మార్కెట్లు కాస్త స్థిరంగా ఉంటే.. కొన్ని స్టాక్స్ మంచి పనితీరును కనబరచున్నాయి. రానున్న రెండు వారాల్లో ఈ స్టాక్స్ లాభాల బాట పట్టనున్నాయని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అవేంటో చూద్దాం.
సైమన్స్ :/ బై రేటింగ్స్ / టార్గెట్ ప్రైస్. రూ. 1,050-1,150 / స్టాప్ లాస్ : రూ.880
ఈ వారంతపు ఛార్ట్‌లలో సైమన్స్ కంపెనీ రూ. 964 ధరతో ప్యాట్రన్ నెక్‌ లైన్‌కు చేరుకుంది. మార్కెట్‌లోని బుల్లిష్ ట్రెండ్సే దీనికి కారణంగా ఎనలిస్టులు భావిస్తున్నారు. ఆ తరువాత సైమన్స్ స్టాక్స్ విషయంలో ఆరోగ్యకర పోటీ ఎదురైతే ఇది మంచి లాభాలతో ఉండనుందని, రూ. 1,050 లెవల్‌కు ఇది రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డైలీ ఛార్ట్‌లో లోయర్ సపోర్ట్ కోసం బుల్‌ జోన్‌లో  40 వ లెవల్ ఏర్పడింది. ఈ పాజిటివ్ రివర్సల్ స్టాక్స్ లో బుల్లిష్ ఆధిపత్యాన్ని సూచిస్తుంది. అందుకే మరో రెండు వారాల్లో ఈ స్టాక్స్ లాభాల బాటలో నడుస్తాయని, టార్గెట్ ప్రైస్ రూ. 1,150 వరకూ పేర్కొంది ఎస్ సెక్యూరిటీస్ సంస్థ.
IPCA ల్యాబరేటరీస్ / బై / టార్గెట్ ప్రైస్. రూ.900-945/ స్టాప్ లాస్ .రూ.730
వీకెండ్ ఛార్ట్‌లలో IPCA ల్యాబ్స్ స్టాక్ ట్రెండ్ లైన్ ప్రతిఘటన నుండి బ్రేక్ అవుట్ సాధించింది. ఇక డైలీ ఛార్ట్‌లలో బుల్లిష్ ట్రెండ్‌ను ఇది అధిగమించింది. అయినప్పటికీ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ పాజిటివ్ గా కనడుతుంది ఈ స్టాక్‌ లో. ఈ స్టాక్ కూడా రూ. 798-802 మధ్యలోకి రావొచ్చని, టార్గెట్ ప్రైస్ రూ. 900-945గా ఉంటుందని ఎస్ సెక్యూరిటీస్ పేర్కొంది.
బాటా ఇండియా / బై / టార్గెట్ ప్రైస్. రూ. 1,160 / స్టాప్ లాస్ .రూ.985
గత వారాంతపు చార్ట్‌లలో స్వింగ్ రెసిస్టెన్స్ ను కనబరిచింది బాటా ఇండియా. చార్ట్ ఫార్మేషన్స్‌లో  హైయ్యర్ టాప్స్ కు  ఈ స్టాక్ చేరుకుంది. డైలీ చార్ట్‌లలో  అనుకూలవంతంగా బాటా ఇండియా స్టాక్ సూచీ పెరుగుతుంది. ఈ స్టాక్స్ కు బై రేటింగ్స్ ఇస్తూ.. టార్గెట్ ప్రైస్ రూ. 1,160గా నిర్ణయించింది అనంద్ రాఠీ బ్రోకరేజ్ కంపెనీ.
అలాగే మరికొన్ని ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు పలు స్టాక్స్ రానున్న రెండు వారాల్లో లాభాలను ఆర్జించి పెట్టనున్నాయని పేర్కొన్నాయి. వాటిలో కొన్ని...

CESC / బై / టార్గెట్ ప్రైస్. రూ. 760/ స్టాప్ లాస్ రూ. 674
గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్ / బై / టార్గెట్ ప్రైస్ .రూ. 907/ స్టాప్ లాస్ రూ. 837
హెక్సావేర్ టెక్నాలజీస్ / బై / టార్గెట్ ప్రైస్ రూ.380/ స్టాప్ లాస్ రూ. 305
స్ట్రైడ్స్ ఫార్మా / బై / టార్గెట్ ప్రైస్ రూ. 530/ స్టాప్ లాస్ రూ.450
అశోక్ లేల్యాండ్ / బై / టార్గెట్ ప్రైస్.రూ.119 / స్టాప్ లాస్ రూ. 109
ఇండియా సిమెంట్స్ / బై / టార్గెట్ ప్రైస్ .రూ.103 / స్టాప్ లాస్ రూ. 89
సిప్లా :/ బై / టార్గెట్ ప్రైస్ . రూ. 580 / స్టాప్ లాస్ రూ. 513
బలరాంపూర్ చిన్ని :/ బై / టార్గెట్ ప్రైస్ రూ. 111/ స్టాప్ లాస్ రూ. 97

 

Disclaimer: పైన ఉదహరించిన అభిప్రాయాలు బ్రోకరేజ్ నిపుణులు పేర్కొన్నవి. స్టాక్స్ ఎంపిక చేసుకునేముందు మరో సారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.

 

 

 Most Popular