నోకియా కొత్త ఫోన్ ఫీచర్లు ఇవే...!

నోకియా కొత్త ఫోన్ ఫీచర్లు ఇవే...!

HMD గ్లోబల్ సంస్థ గత నెల లండన్ లో విడుదల చేసిన నోకియా 7.1 స్మార్ట్ ఫోన్ ని తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈనెల 7నుండి వినియోగదారులకి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర రూ.19,999గా నిర్ణయించారు. భారీ బ్యాటరీ బ్యాకప్, డ్యూయల్ కెమెరాలతో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ పై ఎయిర్ టెల్, HDFC సంస్థలు పలు బంపర్ ఆఫర్లను ప్రకటించాయి. HDFC కార్డు వినియోగదారులు 10% క్యాష్ బ్యాక్ పొందనుండగా, ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.199 రీచార్జీపై 1 టీబీ 4జీ డేటాని పొందనున్నారు.

నోకియా 7.1 ప్రత్యేకతలు:


5.84"  ఫుల్ హెడ్ ప్లస్ డిస్ప్లే (1080 x 2280 పిక్సల్స్)
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్
12/5 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
 3060 ఎంఏహెచ్ బ్యాటరీMost Popular