టైర్ స్టాక్స్ కు టైమొచ్చింది..!

టైర్ స్టాక్స్ కు టైమొచ్చింది..!

ఈక్విటీ మార్కెట్లు భారీ కరెక్షన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వీటిలో మంచి వేల్యూయేషన్స్ ఉన్న స్టాక్స్ ఇప్పుడు డిస్కౌంట్ రేట్లలో లభిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు మాట. అయితే క్రూడ్ ఆయిల్ పతనం ఒక సెక్టార్ కు మాత్రం చాలా వరకూ కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది.. అదే టైర్ సెక్టార్, గత మార్కెట్ కరెక్షన్ లో టైర్ స్టాక్స్ క్రూడ్ ధరల పెరుగుదలతో పాటు పతనం అయ్యాయి. అయితే ఇప్పుడు క్రూడ్ ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. 

రానున్న క్వార్టర్ లో టైర్ స్టాక్స్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కంపెనీల ఎర్నింగ్స్ క్రూడ్ ధరల తగ్గుదలతో పెరుగుదల బాట పట్టాయి. 

ముఖ్యంగా స్మాల్, అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో అమ్మకాల కారణంగా టైర్ స్టాక్స్ 2018లో పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేదు. కేవలం క్రిప్టాన్ ఇండస్ట్రీస్ మినహా దాదాపు అన్ని టైర్ స్టాక్స్ 5 నుంచి 71 శాతం పతనమయ్యాయి. అందులో ఎంఆర్ఎఫ్, టీవీఎస్ శ్రీచక్ర, సియెట్, బాల్ క్రిష్ణ, గుడ్ ఇయర్, అపోలో టైర్స్, జేకే టైర్స్ ఉన్నాయి. 

అయితే ఇన్ పుట్ చార్జీలు తగ్గడం, నేచురల్ రబ్బరు ధరలు తగ్గుముఖం పట్టడం. కూడా టైర్ స్టాక్స్ పుంజుకునేందుకు దోహదం చేయనున్నాయి. అలాగే సింథటిక్ రబ్బర్, కార్బన్ బ్లాక్, కెమికల్స్, లాంటివి టైర్ ఇండస్ట్రీ ఎర్నింగ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. 

అక్టోబర్ లో ఒక బారెల్ క్రూడ్ ధర 86 డాలర్లకు ఎగిసింది. ప్రస్తుతం బారెల్ క్రూడ్ ధర 60 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో టైర్ స్టాక్స్ మీద దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇక దేశీయ టైర్ ఇండస్ట్రీలో సియెట్ సంస్థ మార్కెట్ వాటా 15 శాతానికి పెంచుకోగా, అపోలో టైర్స్ వాటా 29 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ట్రక్ అండ్ బస్ సెగ్మెంట్ లో ఉన్న డిమాండ్ కారణంగా ఈ కంపెనీల మార్కెట్ డిమాండ్ పెరుగుతోంది. 

మరోవైపు ఐఐఎఫ్ఎల్ అపోలో టైర్స్ టార్గెట్ ధరను రూ. 300 నిర్ణయిస్తే,

సియెట్ టార్గెట్ ధరను రూ. 1300 గా నిర్ణయించింది. 
 Most Popular