మ్యూచువల్ ఫండ్స్ ఎంపికలో గుర్తుంచుకోవాల్సిన 5 కీలక విషయాలు

మ్యూచువల్ ఫండ్స్ ఎంపికలో గుర్తుంచుకోవాల్సిన 5 కీలక విషయాలు

మ్యూచువల్ ఫండ్స్ ఎంపికలో అందరూ కామన్ గా చూసేది వాటి ర్యాంకింగ్స్ నే. కానీ కేవలం ర్యాంకింగ్ ప్రాతిపదికన ఆ ఫండ్స్ లో గుడ్డిగా పెట్టుబడులు పెట్టకూడదని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెబుతున్నారు. ఎందుకుంటే కేవలం ర్యాంకింగ్ మాత్రమే కాదు మార్కెట్ స్థితిగతులు, సెక్టార్ పెర్ఫార్మన్స్ వంటివి ఎంఎఫ్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీర్ఘకాల పెట్టుబడుల కిందకు వస్తాయి. సాధారణంగా క్రిసిల్, ఇక్రా, కేర్ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు మ్యూచువల్ ఫండ్స్ కు 1 నుంచి 5 స్టార్స్ రేటింగ్ లను ప్రకటిస్తుంటాయి. 

ర్యాంకింగ్ అనేది ఫండ్ రిస్క్ ను సూచిస్తుంది. అంతే కాదు ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు, ఫండ్ సైజు, ఫండ్ కాల వ్యవధి ఆధారంగా ర్యాంకింగ్ లను ఇస్తుంటారు. 

అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే ముందు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

పెట్టుబడి స్వరూపం : 
పెట్టుబడి పెట్టే ముందు అందులో రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత హై రిటర్న్స్ ఉంటాయి అనేది మార్కెట్ లో సాధారణ సూత్రం అయితే చాలా మంది షార్ట్ టర్మ్ లో నష్టాలు వచ్చినా, లాంగ్ టర్మ్ లో స్థిరమైన రిటర్న్స్ కోసం పెట్టుబడులు పెడుతుంటారు. లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం స్థిరమైన గోల్ ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం.

ఎక్స్ పెన్స్ నిష్పత్తి : 
ఎక్స్ పెన్స్ నిష్పత్తి అనేది మీ రిటర్న్స్ ను చాలావరకూ తినేస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా ప్రకారం ఎక్స్ పెన్స్ నిష్పత్తి 1.5 శాతం వరకూ ఉంటే పర్లేదు. అయితే సాధారణంగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎంఎఫ్‌ల మీద పెద్దగా ప్రభావం చూపవు. అయితే ఎంఎఫ్‌ల పెర్ఫార్మెన్స్ కాస్త గతి తప్పినా ఎక్స్‌పెన్స్ నిష్పత్తి కారణంగా మరింత నష్టపోయే చాన్స్ ఉంది. 

ఫండ్ మేనేజర్ :
ఫండ్ ఎంపికలో ఫండ్ మేనేజర్ దే కీలకపాత్ర, పోర్ట్ ఫోలియో కూర్పు ద్వారానే ఫండ్ లాభదాయకత ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫండ్ మేనేజర్ గత పెర్ఫార్మెన్స్ ను ఆధారంగా తీసుకోవాలి. అలాగే పోర్ట్ ఫోలియో ఎంపిక కూడా ఫండ్ మేనేజర్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. 

బెంచ్ మార్క్ : 
బెంచ్ మార్క్ ద్వారానే ఫండ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో తెలుసుకునే వీలుంది. ఇతర ఫండ్స్ కన్నా ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తుందో తెలుసుకునేందుకు బెంచ్ మార్క్ తెలుపుతుంది. ఔట్ పెర్ఫార్మ్ చేస్తున్న ఫండ్స్ ను గుర్తించడం ద్వారా అందులో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. 

పెర్ఫార్మెన్స్ : 
పెర్ఫార్మెన్స్ అనేదే ఫండ్స్ లో అసలైన గీటురాయి. ఒక ఫండ్ లోని పోర్ట్ ఫోలియో ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తే అంత బాగా రిటర్న్స్ వస్తుంటాయి. స్థిరమైన రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ను ఎంపిక చేసుకుంటే మీ మదుపుకు భద్రత భరోసా దొరుకుతుంది.   



Most Popular