ఖాతాదారులపై బ్యాంకుల GST బాదుడు...!

ఖాతాదారులపై బ్యాంకుల GST బాదుడు...!

ఇప్పటికే సర్‌ఛార్జీల పేరుతో కస్టమర్లపై భారం వేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు , ఇకపై బ్యాంకింగ్ జీఎస్టీ ట్యాక్స్‌ను కూడా కస్టమర్లపైనే వేయనున్నాయి. రెండు నెలల క్రితం ట్యాక్స్ డిపార్ట్ మెంట్, బ్యాంకులు ఇస్తున్న ఉచిత సర్వీసులపై జీఎస్టీ విధింపుపై బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ సేవలపై బ్యాంకులకు ప్రభుత్వం జీఎస్టీని విధించబోతుంది. అయితే.. బ్యాంకులు మాత్రం ఈ ప్రతిపాదనను స్వాగతిస్తూనే , గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ను కస్టమర్లపై వేయడానికి రంగం సిద్ధం చేసకుంటున్నాయి. బ్యాంకులు వినియోగదారులకు అందించే సర్వీసులైన చెక్ బుక్ జారీ, క్రెడిట్ కార్డ్ మంజూరు, ఏటీఎంల వాడకం , ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రిఫండ్స్ వంటి వాటిని ప్రస్తుతానికి ఉచితంగానే అందిస్తున్నాయి. కానీ ఈ సేవలపై ప్రభుత్వం GST ని విధించనుంది. చాలా వరకూ బ్యాంకులు ఈ జీఎస్టీ భారాన్ని కస్టమర్లపైనే వేయడానికి ఇష్టపడుతున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి బ్యాంకులు అందించిన ఈ సేవల మీద జీఎస్టీ ఉండబోతుంది. అంతే కాకుండా వీటి మీద దాదాపు రూ. 40,000 కోట్ల ట్యాక్స్ , పెనాల్టీలను బ్యాంకుల నుండి ప్రభుత్వం రాబట్టనుంది. ఈ విధానం అమలైతే..  కస్టమర్ల ట్యాక్సులు నేరుగా ప్రభుత్వానికే వెళ్ళిపోతాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. అయితే ఈ జీఎస్టీని ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా విధించనుందని సమాచారం. కొన్ని బ్యాంకులు అందించే ఉచిత సేవల విషయంలో బ్యాంకుల మధ్య వైరుధ్యాలు ఉండటమే దీనికి కారణం. దేశంలో ఉన్న అన్ని మేజర్ బ్యాంకులు ఈ 18 శాతం జీఎస్టీ విధింపుపై తమ సమ్మతిని తెలియజేశాయి. అయితే ఎంత జీఎస్టీని కస్టమర్లకు విధించాలన్నదానిపై తుది కసరత్తులు జరుగుతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. బ్యాంకు ఖాతాలో కనీస నిల్వలను మెయిన్‌టైన్‌ చేయని ఖాతాదారులకు ఇది భారంగా మారనుందని వారు పేర్కొన్నారు. మినిమమ్ బ్యాలెన్స్ మేయిన్‌టెన్ చేసే వారికి అందించే ఉచిత సర్వీసుల మీద కూడా జీఎస్టీ ఉండబోతుందని సమాచారం.  బ్యాంకులకు విధించబోయే జీఎస్టీ వ్యవహారాన్ని ఇతర రంగాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. CGST చట్టం లోని షెడ్యూల్ 2 ప్రకారం ఇతర నాన్ బ్యాంకింగ్ రంగాల్లో కూడా జీఎస్టీ అమలుపై ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కసరత్తులు చేస్తుంది. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో మల్టీనేషనల్ బ్యాంకులైన DBS బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లు కూడా ఉన్నాయి. ఈ డిసెంబర్ నుండే బ్యాంకులు జీఎస్టీని విధించనున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.  
 Most Popular