ఈ పది స్టాక్స్ లో విదేశీ ఇన్వెస్టర్లు తెగ పెట్టుబడులు పెడుతున్నారు

ఈ పది స్టాక్స్ లో విదేశీ ఇన్వెస్టర్లు తెగ పెట్టుబడులు పెడుతున్నారు

మార్కెట్ సూచీల్లో ప్రధానమైది ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (FPI)లను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అక్టోబర్ లో మార్కెట్ పతనానికి ఈ ఎఫ్‌పీఐలు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడమే కారణంగా విశ్లేషకులు చెబుతుంటారు. క్యూ2లో ఎఫ్‌పీఐలు సుమారు 19 వేల కోట్ల సంపదను ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టాయి. 

ఇదిలా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం పెద్ద ఎత్తున బ్యాంకులు, మెటల్స్, మైనింగ్, ఇతర డైవర్సిఫైడ్ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. బీఎస్ఈ 200 సూచీలో వీటి వాటా సుమారు 6.5 శాతానికి పెరిగింది. గత జూన్ క్వార్టర్ లో వీటి వాటా 6.4 శాతంగా ఉంది. 

మరోవైపు ఎఫ్‌పీఐలు సెప్టెంబర్ లో ముగిసిన గత క్వార్టర్ లో రూ.10,200కోట్ల మేర అమ్మకాలకు దిగాయి. అందులో ప్రధానంగా ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసులు, మెటల్స్, మైనింగ్ షేర్లు పెద్ద ఎత్తున ఎఫ్ పీఐల అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. 

గత క్వార్టర్ లో ఎఫ్‌పీఐలు బీఎస్ఈ 200 సూచీలో తమ వాటాను 23.6 శాతానికి తగ్గించుకున్నాయి. అదే సమయంలో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 4.5 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ సూచీ 10 శాతం నష్టపోయింది. 

అయితే క్వార్టర్ 2లో ఎఫ్‌పీఐలు గరిష్ట మొత్తంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో తమ హోల్డింగ్స్ ను 10.2 శాతం నుంచి 20.6 శాతానికి పెంచుకుంది. అంతే తమ వాటాలను 10.4 శాతానికి పెంచుకున్నాయి. ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెంచుకున్న టాప్ 30 స్టాక్స్ లో ఏయూ స్మాల్ ఫైనాన్స మొదటి స్థానంలో ఉంది. ఇక అలాగే ఇండియన్ హోటెల్స్ కంపెనీ, మహానగర్ గ్యాస్, హెక్సావేర్ టెక్నాలజీస్, నారాయణ హ్రుదయాలయ, కావేరీ సీడ్, టీమ్ లీజ్ సర్వీస్, ఐసీఐసీఐ లాంబార్డ్; మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్, రిలయన్స్ క్యాపిటల్ షేర్లలో ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు 2 నుంచి 8 శాతం చొప్పున తమ వాటాలను పెంచుకుంటూ కొనుగోళ్లు చేయనున్నారు. 


అలాగే వోడఫోన్ ఐడియా, పీసీ జువెలర్స్, పీఎన్‌బీ, మన్ పసంద్, వక్రాంగీ, అపోలో హాస్పిటల్స్ , ఎస్ బ్యాంక్, భారత్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిష్ టీవీ లాంటి షేర్లలో ఎఫ్‌పీఐలు తమ వాటాలను తగ్గించుకోనేందుకు అమ్మకాలకు దిగాయి. Most Popular