ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ పుష్‌- స్టాక్స్‌ స్పీడ్‌

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ పుష్‌- స్టాక్స్‌ స్పీడ్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా రుణాల సెక్యూరిటైజేషన్‌ నిబంధనలను సరళతరం చేయడంతో నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌(ఎన్‌బీఎఫ్‌సీ)కు హుషారొచ్చింది. ఐదేళ్లకుపైగా మెచూరిటీ కలిగిన రుణాలను విక్రయించేందుకు (సెక్యూరిటైజేషన్‌) ఆర్‌బీఐ నిబంధనలు సడలించింది. ఇప్పటివరకూ ఈ రుణాల సెక్యూరిటైజేషన్‌కు ఏడాదికాలంపాటు హోల్డ్‌ చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆరు నెలల కాలానికి నిబంధనలను సవరించింది. దీంతో గత కొద్ది కాలంగా లిక్విడిటీ, మొండిబకాయిల సమస్యలతో కుదేలైన ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ఉపశమనం లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లిక్విడిటీ సమస్యలకుతోడు ఇటీవల ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ఈ రంగంలోని పలు కంపెనీలకు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Image result for housing finance

హౌసింగ్‌కు ఊరట
ఆర్‌బీఐ చేపట్టిన సెక్యూరిటైజేషన్‌ నిబంధనల సరళీకరణ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు ప్రధానంగా హౌసింగ్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీలకు ఊరటనివ్వనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. గృహ రుణాల విషయంలో దీర్ఘకాల పరిమితి అమలయ్యే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీలు ఐదేళ్లకుపైగా గడువు కలిగిన రుణాలను ఆరు నెలలపాటు హోల్డ్‌ చేయడం ద్వారా సెక్యూరిటైజ్‌ చేసేందుకు వీలు కలగనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఈ రుణాల బుక్‌వేల్యూలో 20 శాతాన్ని ఎన్‌బీఎఫ్‌సీలు అట్టిపెట్టుకునే పరిస్థితుల్లోనే ఇందుకు అవకాశముంటుందని వివరించారు.

Image result for NBFC

షేర్ల జోరు   
ఆర్‌బీఐ తాజా చర్యల నేపథ్యంలో పలు ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ కౌంటర్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రెప్కో హోమ్‌ 8 శాతం దూసుకెళ్లి రూ. 368 వద్ద ట్రేడవుతోంది. తొలు రూ. 373 వరకూ పుంజుకోగా.. దివాన్‌ హౌసింగ్‌ 5.6 శాతం జంప్‌చేసి రూ. 211కు చేరింది. ఇంట్రాడేలో రూ. 215 వరకూ ఎగసింది. ఈ బాటలో గృహ ఫైనాన్స్‌ 3 శాతం పెరిగి రూ. 295కు చేరగా.. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 2 శాతం బలపడి రూ. 716ను తాకింది. తొలుత రూ. 725 వరకూ పురోగమించింది. ఇక  కేన్‌ ఫిన్‌ హోమ్‌ 1.5 శాతం లాభంతో రూ. 272 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 280 వరకూ జంప్‌చేసింది. ఇదేవిధంగా రిలయన్స్ హోమ్‌ 2.4 శాతం వృద్ధితో రూ. 43 వద్ద, జీఐసీ హౌసింగ్‌ 1.5 శాతం లాభంతొ రూ. 233 వద్ద, బజాజ్‌ ఫైనాన్స్‌ 1 శాతం పెరిగి రూ. 2529 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ తొలుత రూ. 2564ను తాకింది.Most Popular