పాన్ కార్డ్ రూల్స్ మారాయి.. తెలుసా..?

పాన్ కార్డ్ రూల్స్ మారాయి.. తెలుసా..?

భారత దేశంలో ట్యాక్స్ ఎసెస్‌మెంట్ కోసం, స్థిరాస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా, ఏడాదికి రూ.5 లక్షల పైబడి టర్నోవర్ ఉన్న వ్యాపారులు, రూ. 5లక్షల పైబడి జీతాలున్న ఉద్యోగస్తులు అందరికీ పాన్ కార్డ్ కంపల్సరీ అన్న విషయం తెలిసిందే. మోటార్ బైక్ కానీ, వాహనం కానీ కొనాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. మన బ్యాంక్ ఖాతాలో ఒక రోజులో రూ.50,000 ట్రాన్సక్షన్‌ జరిపినా పాన్ కార్డ్ నెంబర్ ఉదహరించాల్సిందే. బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డీమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చేయాలన్నా, స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు జరపాలన్నా కూడా పాన్ కార్డ్ ఉండాల్సిందే.
పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ (PAN)  అనేది ఒకప్పుడు స్వచ్ఛందంగా సమర్పించాల్సిన డాక్యుమెంట్‌గా పరిగణించినా.. ఇప్పుడు మాత్రం మాండేటరీ (తప్పనిసరిగా )గా మార్చారు. దేశంలోని నగదు చలామణీని క్రమబద్దీకరించడం కోసం, రూ. 50,000 మరియు ఆపై మొత్తం లావాదేవీలు ఎక్కడ జరిగినా గుర్తించడం కోసం పాన్ కార్డ్ ఉపయోగ పడుతుంది. వ్యాపారులు, ఇన్ కం ట్యాక్స్ పే చేసే సాలరీ ఎంప్లాయిస్ తమ రిటర్న్స్ దాఖలు చేయడానికి కూడా పాన్ కార్డ్ తప్పని సరి. అయితే ఈ పాన్ కార్డ్  నియమ నిబంధనలను ప్రభుత్వం ఇప్పుడు కొద్దిగా మార్చింది.
సంవత్సరానికి రూ.2.5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ పాన్ కార్డ్‌ను కలిగి ఉండాలి. వైడ్ ఫైనాన్స్ చట్టం 2018, సెక్షన్ 139A -ఇన్‌కం ట్యాక్స్ ఏక్ట్ 1961 ప్రకారం  ఈ కింది వ్యక్తులు తప్పని సరిగా పాన్ కార్డ్‌ను కలిగి ఉండాల్సిందే.
వారిలో ఏడాదికి రూ. 2.5 లక్షల పైబడి టర్నోవర్ కలిగి ఉన్న వ్యక్తులు, మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్, పార్ట్‌నర్, ట్రస్టీ, సంపాదకులు, యజమానులు, ఫౌండర్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రిన్సిపల్ ఆఫీసర్, ఆఫీస్ బేరర్, లేదా పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తులు పాన్ కార్డ్ ను తప్పని సరిగా కలిగి ఉండాలని ఇన్ కం ట్యాక్స్ పేర్కొంది.గతంలో ఏడాదికి రూ. 5 లక్షల పైబడి టర్నోవర్ ఉన్న వారికి పాన్ కార్డ్ కంపల్సరీగా ఉండేది. కానీ ఇప్పుడు సవరించిన నింబంధనల మేరకు సాలీనా..రూ. 2.5 లక్షల టర్నోవర్ గానీ, ఆదాయం గానీ ఉంటే పాన్ కార్డ్ తప్పని సరిగా మారింది.   స్థిర చరాస్థులు కొనాలన్నా, అమ్మాలన్నా ఆయా వ్యక్తులకు పాన్ కార్డ్ కంపల్సరీ అని ప్రభుత్వం పేర్కొంది. అయితే  ఆర్ధిక సంవత్సరం లావాదేవీల కోసం ఆ సంవత్సరం మే 31 లోపు పాన్ కార్డ్ పొందాలని సవరించిన నిబంధనలలో పేర్కొంది.  అంతే కాకుండా పాన్ కార్డ్ దరఖాస్తు ఫాం నెంబర్ 49/49A  లలో గతంలో తండ్రి పేరు మాండేటరీగా ఉండేది. ఇప్పుడు అది తీసివేసి తల్లి పేరు కూడా పేర్కొనొచ్చని ప్రభుత్వం తెలిపింది. తండ్రి లేదా తల్లి పేరు రాస్తే చాలని, తండ్రి పేరు రాయడానికి ఇష్టపడని వ్యక్తులు తమ తల్లి పేరును పేర్కొనొచ్చని తెలుస్తుంది.  ఇక నుండి పాన్ కార్డ్ ID నెంబర్స్ IT రంగానికి కూడా సులువుగా వాడుకునేలా మార్చామని, ఆల్ఫా న్యూమరిక్ కారెక్టర్లతో కూడిన పాన్ కార్డులను జారీ చేస్తున్నామని ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది.దేశంలో జరిగే అన్ని రకాల లావాదేవీలకు అనుగుణంగా కొత్త పాన్ కార్డులను తీర్చిదిద్దామని ప్రభుత్వం అంటోంది. ఈ సవరించిన నిబంధనలు ఈ డిసెంబర్ 5 నుండి అమల్లోకి రానున్నాయని తెలిపింది.

 Most Popular