కొత్త నోట్ల క్వాలిటీ అంతంతే ! 2 ఏళ్లకే చిరిగిపోతున్నాయ్..!

కొత్త నోట్ల క్వాలిటీ అంతంతే ! 2 ఏళ్లకే చిరిగిపోతున్నాయ్..!

నోట్ల రద్దు తరువాత ముద్రించిన కొత్త నోట్ల నాణ్యతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. చలామణిలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి కాకముందే..నోట్లు చిరిగిపోతున్నాయని పలువురు వాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే చాలా సంఖ్యలో ఈ కొత్త నొట్లు చిరిగిపోయాయని బ్యాంకులకు రిటర్న్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త రూ. 2000 నోటు, రూ.500 నోటు విషయంలో పేపర్ క్వాలిటీ సరిగా లేదని పలువురు ప్రింటింగ్  పరిజ్ఞానం ఉన్న వారు కూడా అంటుండటం గమనార్హం. పాత నోట్ల రద్దు తరువాత, దాదాపు రూ.7000 కోట్ల ఖర్చుతో ఈ కొత్త నొట్లను RBI ముద్రించింది. వీటిలో ఎక్కువ శాతం చిరిగిపోయాయని బ్యాంకులకు రిటర్న్ రావడంతో బ్యాంకులు ఆయా నోట్లను RBI కు పంపిస్తున్నాయి. ఈ చిరిగిన నోట్లను బ్యాంకులు ' నాన్ ఇష్యుబుల్ ' కేటగిరి కింద లెక్కిస్తాయి. అలా బ్యాంకులకు వచ్చిన పరిశుభ్రంగా లేని నోట్లు, చిరిగిపోయిన నోట్లు, కాలిన లేదా సగం కాలిన నోట్లను నాన్ ఇష్యుబుల్‌ గా పరిగణించి వాటిని ఆర్బీఐకి తిప్పి పంపుతాయి . గతంలో ఈ చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకోడాన్ని ఆర్బీఐ అనుమతించలేదు. కానీ.. కార్పోరేట్ బ్యాంకుల ఒత్తడితో ఈ రూల్‌ను 2018 జులైలో సడలించింది. ఇప్పటికైనా నోట్ల నాణ్యత విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 Most Popular