త్వరలో కేంద్రం గోల్డ్ పాలసీ.. ఏం చేయబోతున్నారో తెలుసా..?

త్వరలో కేంద్రం గోల్డ్ పాలసీ.. ఏం చేయబోతున్నారో తెలుసా..?

మన దేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా బంగారాన్ని ముఖ్య సంపదగా భావిస్తారు. ఈ బంగారం విషయంలో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక నూతన డొమెస్టిక్ గోల్డ్ పాలసీని తీసుకురాబోతుందని కామర్స్ మినిస్టర్‌ సురేష్ ప్రభు వెల్లడించారు. అన్ని సమస్యలను సంపూర్ణ రీతిలో పరిష్కరించడానికి ఒక ఇంటిగ్రేటెడ్ గోల్డ్ విధానం ఉండాలని కేంద్రం యోచిస్తుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఒక గొల్డ్ కౌన్సిల్‌ను నియమించనున్నట్టు సురేష్‌ ప్రభు పేర్కొన్నారు. ఈ పాలసీ రూపురేఖలు, నిర్మాణం , కౌన్సిల్ లో ఎవరుండాలన్న దానిమీద చర్చలు జరగుతున్నాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఆర్ధిక శాఖ కార్యదర్శి కూడా బంగారు వర్తకులను సలహాలు , సూచనలు ఇమ్మని కోరినట్టు తెలుస్తుంది. వజ్రాలు, బంగారు ఆభరణాలు ఇతర దేశాలకు ఎగుమతి విషయంలో ఈ గోల్డ్ పాలసీ లాభదాయకంగా ఉంటుందని మంత్రి సురేష్ ప్రభు అంటున్నారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా గోల్డ్ విధానం అంటూ ఒకటుండాలని, బంగారాన్ని ఒక ఆస్తి తరగతికి చెందిందిగా అభివృద్ధి చేయడానికి సమగ్ర బంగారు పాలసీని రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఇది రానున్న ఫిబ్రవరి కల్లా ఓ రూపు సంతరించుకోనుందని సమాచారం. కాగా ఇది పూర్తిగా వ్యాపార అనుకూలంగానే ఉండబోతుందని, ఎలాంటి అనుమానాలు పెట్టకోనక్కర్లేదని మంత్రిత్వ వర్గాలు అంటున్నాయి. ఈ విధానంతో వజ్రాభరణాలు, జ్యుయల్రీ ఎగుమతులతో బాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగు పడతాయని భావిస్తున్నట్టు కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది.
 Most Popular