దీపక్‌ ఫెర్టిలైజర్స్‌కు క్యూ2 దెబ్బ

దీపక్‌ ఫెర్టిలైజర్స్‌కు క్యూ2 దెబ్బ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎరువులు, రసాయనాల కంపెనీ దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌  పెట్రోకెమికల్స్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమైంది. రూ. 167 దిగువన ట్రేడవుతోంది. ఇది రెండేళ్ల కనిష్టంకావడం గమనించదగ్గ అంశం! ఇంతక్రితం 2016 ఆగస్ట్‌ 19న మాత్రమే ఈ స్థాయిలో దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ షేరు ట్రేడయ్యింది. కాగా.. ఫలితాలు నిరాశపరచడంతోపాటు ఇటీవల కంపెనీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించడంతో ఇన్వెస్టర్లు ఇటీవల ఈ కౌంటర్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. దీంతో గత వారం రోజుల్లో ఈ షేరు 20 శాతం వెనకడుగు వేసింది. వెరసి ఈ ఏడాది జనవరిలో నమోదైన 52 వారాల గరిష్టం రూ. 437 నుంచి చూస్తే ఇప్పటివరకూ 62 శాతం దిగజారింది. 

క్యూ2 వీక్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ నికర లాభం 57 శాతం క్షీణించింది. రూ. 19 కోట్లకు పరిమితమైంది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 44 శాతం పెరిగి రూ. 1782 కోట్లను అధిగమించింది. Most Popular