ముచ్చటగా మూడు వారాల్లో లాభాలు పంచే స్టాక్స్...

ముచ్చటగా మూడు వారాల్లో లాభాలు పంచే స్టాక్స్...

మార్కెట్లు ఈ వారం లాభాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ , నిఫ్టీ సూచీలు పైపైకి కదులుతున్నాయి. నిఫ్టీ 50 ఈ వారం 10,650 పాయింట్లను తాకింది. మరి  సెన్సెక్స్ కూడా 35,600 పాయింట్లను అధిగమించింది. సోమవారం మార్కట్లలో సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లు లాభ పడింది. మార్కెట్ ఎనలిస్టులు, విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ ఊపు మరో రెండు వారాల పాటు కొనసాగొచ్చని వారి అంచనా. మరి కొంత మంది ఎనలిస్టులు నిఫ్టీ 10,882 పాయింట్లను దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
రాబోయే మూడు వారాల్లో ఈ స్టాక్స్ లాభాలను తెస్తాయి..
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు కొన్ని స్టాక్స్ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు. వారి రికమండేషన్స్ ప్రకారం ఏ ఏ స్టాక్స్ లాభాలను తీసుకోస్తాయో చూద్దాం. CMT అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఆనంద్ రాఠీ చీఫ్ రీసెర్చ్ ఎనలిస్ట్ జై ఆనంద్ టక్కర్ అంచనాల ప్రకారం మార్కెట్ సానుకూల పవనాల వల్ల కొన్ని స్టాక్స్ గణనీయ లాభాలను ఇస్తాయని మదుపర్లకు సూచిస్తున్నారు.


అపోలో హాస్పిటల్స్ :  రేటింగ్స్  " బై " :  టార్గెట్ ప్రైస్ . రూ. 1,350 : స్టాప్ లాస్ : రూ. 1,190
అపోలో హాస్పిటల్స్ స్టాక్స్ పడిపోతున్న ఛానల్‌ నుండి అద్భుతాలనే చేసింది. హెడ్ ఎండ్ షోల్డర్ గ్రాఫ్ తో వేగంగా పుంజుకున్న స్టాక్ ఇది. ఈ స్టాక్స్ గ్రాఫ్‌ లో వేవ్ 4ను పూర్తి చేసి వేవ్ 5 రేంజ్‌కి రావడం గమనించవచ్చు. అందుకే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్స్ టార్గెట్ ధర రూ. 1,350 గా , స్టాప్ లాస్ రూ. 1,190 గా నిర్ణయించాయి.


కెనరా బ్యాంక్ :  టార్గెట్ ప్రైస్. రూ. 295 : స్టాప్ లాస్ : రూ. 249
గత వారపు రెసిస్టెన్స్ ఊగిసలాట నుండి కెనరా బ్యాంక్ స్టాక్స్ బ్రేక్ అవుట్‌ను సాధించింది. మూమెంటమ్ సూచీలు కూడా ఈ స్టాక్స్ ను కొనచ్చని పేర్కొంటున్నాయి. సానుకూల దిశగా ఈ స్టాక్స్ పుంజుకోవడం గమనించవచ్చు. గ్రాఫ్ లో 3/C వేవ్ కనబడుతుంది. కాబట్టి బ్రోకరేజ్ నిపుణులు  కెనరా బ్యాంక్ షేర్ రానున్న మూడు వారాల్లో లాభాలను అందించనుందని భావిస్తున్నారు.


ఎవరెడీ ఇండస్ట్రీస్ : రేటింగ్స్ : " బై " : టార్గెట్ ధర. రూ.243 : స్టాప్ లాస్ రూ. 189 :
డైలీ ఛార్ట్ లో డబుల్ బాటమ్ క్షీణత నుండి వేగంగా పైకి దూసుకొచ్చిన స్టాక్ ఎవరెడీ ఇండస్ట్రీస్.  గ్రాఫ్ లో వేవ్ 5 ను టచ్ చేసింది, రానున్న రోజుల్లో రూ.243 వద్దకు చేరుకోవచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. స్టాప్ లాస్ గా రూ. 189 అనేది మంచి సపోర్ట్ గా భావించవచ్చని వారు పేర్కొన్నారు. రానున్న మూడు వారాల్లో ఈ స్టాక్స్ లాభాలను అందించవచ్చని షేర్ ఖాన్ బ్రోకరేజ్ సంస్థకు చెందిన ఎనలిస్ట్ గౌరవ్ పేర్కొన్నారు.


బ్యాంక్ ఆఫ్ బరోడా :  రేటింగ్స్ ." బై " : టార్గెట్ ప్రైస్ . రూ. 130 : స్టాప్ లాస్ . రూ. 125
గత పలు వారాల నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా రికవరీ మోడ్ లో ఉంది. గత కొన్ని సెషన్స్ నుండి కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది ఈ స్టాక్. అక్కడి నుండి కంపెనీ షేర్ వేగంగా పుంజుకోవడం గమనించవచ్చు. గత శుక్రవారం కన్సాలిడేషన్ ఫేజ్‌ను అధిగమించి ముందుకు దూసుకెళ్ళింది. రోజువారీ మూమెంటమ్ ప్రకారం ఈ స్టాక్ బై రేటింగ్ లో ఉంది.


విజయా బ్యాంక్ : రేటింగ్ . " బై " :  టార్గెట్ ప్రైస్ . రూ. 50 : స్టాప్ లాస్ రూ. 41 :
గత కొన్ని వారాలుగా విజయ బ్యాంక్ షేర్ అండర్ పెర్ఫార్మింగ్ లో ఉంది. కానీ ముందు ముందు ఇది పుంజుకుంటుందని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. రానున్న సెషన్స్ లో షార్ప్ రికవరీ సాధ్యమేనని వారు అంచనా వేస్తున్నారు. గ్రాఫ్ లో రానున్న రోజుల్లో పుంజుకోవచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. డైలీ మూమెంటమ్ గ్రాఫ్ కూడా విజయా బ్యాంక్ స్టాక్స్ ను బై రేటింగ్స్ లో ఉంచుతుందని జెమ్ స్టోన్ ఈక్విటీ  ఎనలిస్ట్ మిలన్ వైష్ణవ్ సూచిస్తున్నారు.


హాత్ వే కేబుల్ &డాటాకాం:  రేటింగ్స్ "బై" : టార్గెట్ ప్రైస్ . రూ. 38 : స్టాప్ లాస్ రూ. 27:
హాత్ వే కేబుల్ స్టాక్ గత రెండు వారాల్లో తీవ్ర స్థిరీకరణకు గురైంది. కానీ షార్ప్ ప్రైస్ పెరుగుదల రెండు వైపులా కనబడుతుంది. టెక్నికల్‌గా ఈ స్టాక్ వాల్యూ పెరగనుందని సూచీలు చెబుతున్నాయి. గ్రాఫ్‌లో అప్పర్ బోలింగర్ బాండ్ కు హాత్ వే చేరుకుంది. స్టాక్ పెరుగుదల గత 50 వారాల గరిష్టానికి చేరుకోవచ్చని ఎనలిస్టుల అంచనా. హాత్ వే PPO ( పర్సంటేజ్ ప్రైస్ ఆక్సిలేటర్ ) పాజిటివ్ గా కనబడుతుంది.


ఇండియన్ హోటల్స్ కంపెనీ : రేటింగ్స్ " బై " : టార్గెట్ ప్రైస్ రూ. 160 : స్టాప్ లాస్ రూ. 120 :
గత రెండు రోజులుగా నిద్రాణంగా ఉన్న ఇండియన్ హోటల్స్ స్టాక్స్  డైలీ ఛార్ట్ లో అప్పర్ బోలింగర్ బాండ్‌ను దాటింది. ఈ స్టాక్ PPO కూడా పాజిటివ్ గా ఉండటంతో రానున్న 3 వారాల్లో ఈ స్టాక్ లాభాల బాటన పయనించ వచ్చని ఎనలస్టులు సూచిస్తున్నారు. వీక్లీ ఛార్ట్స్ లో కూడా     MACD  సానుకూల అధిగమనాలను  చూపిస్తుంది.


బ్రిటానియా :  రేటింగ్స్ "బై " : టార్గెట్ ధర రూ. 6300 : స్టాప్ లాస్ రూ. 5,780 :
గత ఆరు సెషన్ల నష్టాల నుండి బ్రిటానియా కోలుకుంది.  గ్రాఫ్ సూచీ కూడా బ్రిటానియా షేర్ల పెరుగుదలను సూచిస్తుంది. బ్రేక్ అవుట్ ను సాధిస్తూ.. హెడ్ ఎండ్ షోల్డర్ నమూనాలో గ్రాఫ్ కనబడుతుంది. పోజీషనల్ ట్రేడర్స్ ఈ స్టాక్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే బ్రిటానియా టార్గెట్ ధర రూ. 6,300 గా ఎనలిస్టులు పేర్కొన్నారు.


వెంకీ ఇండియా : రేటింగ్స్ " బై " : టార్గెట్ ప్రైస్ రూ. 2,814 : స్టాప్ లాస్ రూ. 2,300
షార్ట్ టర్మ్ ఛార్ట్స్ లో వెంకీ ఇండియా స్టాక్స్ వేగంగా పైకి కదులుతున్నాయి. స్ట్రాంగ్ ఓపెనింగ్‌లో ఈ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. గత ఆరు సెషన్ల నష్టాలను చెరిపివేస్తూ.. లాభాలను నమోదు చేసింది వెంకి ఇండియా. ఈ స్టాక్స్ ను కూడా పొజీషనల్ ట్రేడర్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

Disclaimer : పైన ఉదహరించిన సూచనలు, సలహాలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు సూచించినవి మాత్రమే. స్టాక్స్ కొనుగోలు చేసే ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.
 


 Most Popular