క్రిధాన్‌కు ఆర్డర్ కిక్‌- బైబ్యాక్‌తో హెగ్‌ అప్‌

క్రిధాన్‌కు ఆర్డర్ కిక్‌- బైబ్యాక్‌తో హెగ్‌ అప్‌

విదేశీ అనుబంధ సంస్థ ద్వారా కాంట్రాక్ట్‌ పొందినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ క్రిధాన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. దీంతో ఈ కౌంటర్‌ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ దిగ్గజం హెచ్‌ఈజీ(హెగ్‌) కౌంటర్‌ సైతం జోరందుకుంది. వివరాలు ఇవీ...

క్రిధాన్‌ ఇన్‌ఫ్రా
సింగపూర్‌ అనుబంధ సంస్థ స్వీ హాంగ్‌ ద్వారా పబ్లిక్‌ యుటిలిటీస్‌ బోర్డు నుంచి కాంట్రాక్ట్‌ పొందినట్లు వెల్లడించడంతో క్రిధాన్‌ ఇన్‌ఫ్రా కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 13 శాతం దూసుకెళ్లి రూ. 52 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 54 వద్ద గరిష్టాన్నీ, రూ. 48 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఆర్డర్‌ విలువ రూ. 195 కోట్లుకాగా.. డీటీఎస్‌ఎస్‌ రెండో దశలో భాగంగా లింక్‌ సీవర్స్‌ను నిర్మించాల్సి ఉంటుందని తెలియజేసింది. సింగపూర్‌ ఈపీసీ సంస్థ స్వీ హాంగ్‌లో క్రిధాన్‌ ఇన్‌ఫ్రా 2016లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది.

Image result for HEG Ltd

హెచ్‌ఈజీ లిమిటెడ్‌
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను ప్రకటించడంతో హెచ్‌ఈజీ లిమిటెడ్‌ కౌంటర్‌ నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.5 శాతం పుంజుకుని రూ. 4355 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 4475 వద్ద గరిష్టాన్నీ, రూ. 4332 వద్ద కనిష్టాన్నీ తాకింది. బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 26న సమావేశంకానున్నట్లు హెచ్‌ఈజీ పేర్కొంది.Most Popular