అక్టోబర్‌లో FIIs, మ్యూచువల్ ఫండ్స్ కొన్న స్టాక్స్ ఇవే..?

అక్టోబర్‌లో FIIs, మ్యూచువల్ ఫండ్స్ కొన్న స్టాక్స్ ఇవే..?

సాధారణంగా మంచి స్టాక్స్‌ను ఎన్నుకోవాలంటే.. ఆర్ధిక నిపుణులు, మార్కెట్ ఎనలిస్టుల సలహాలను మదుపర్లు తీసుకుంటుంటారు. అంతే కాకుండా.. మదుపర్లు, ఎనలిస్టులు కూడా విదేశీ ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలనూ, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ ఫోలియోలను తరచి చూస్తుంటారు. లాభాల స్వీకరణలో FIIs, MF ల పోర్ట్ ఫోలియోలు ముందుంటాయి. అందుకే వీటిని ఇన్వెస్టర్లు పరిశీలిస్తుంటారు.  గత ఆర్ధిక సంవత్సరం నుండి చూస్తే... విదేశీ మదపర్లు (FIIs) , మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ రంగాల్లోని దాదాపు 138 స్టాక్స్ ఈ ఇరువురి పోర్ట్ ఫోలియోల్లోనూ కనబడ్డాయి. ఇందులో దాదాపు 14 స్టాక్స్ గత సంవత్సర కాలంగా 22-80 శాతం వరకూ పడిపోయినవే ఉండటం గమనార్హం. అంతే కాకుండా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో FIIs, మ్యూచువల్ ఫండ్స్ వారు ఈ స్టాక్స్ లో వాటాలను పెంచుకుంటూ పోతున్నారు. 8K మైల్స్, CL ఎడ్యుకేట్, భారతీ ఇన్ఫ్రాటెల్ , భన్సాలీ ఇంజనీరింగ్, బాలాజీ టెలీఫిల్మ్స్ , BHEL, అంబుజా సిమెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, అమృతాంజన్ హెల్త్, వంటి స్టాక్స్ పతనం బాటలో పయనించినా.. ఈ స్టాక్స్ ను విదేశీ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ వారు హోల్డ్ చేశారు.

 వీటిలో కొన్ని కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిళ్ళు ఎదుర్కొన్నా... వాటినే ఎంచుకున్నారు FIIలు. స్టాక్ వాల్యూ పడిపోతున్నా.. కంపెనీ క్వాలిటీ, మెయిన్‌టెన్స్ బాగున్న కంపెనీల వైపు మ్యూచువల్ ఫండ్స్ వారు మొగ్గు చూపారు. రానున్న రెండేళ్ళలో వీటి పనితీరు గణనీయంగా మెరుగు పడుతుందని వారి భావన కావొచ్చని ప్రముఖ మార్కెట్ ఎనలిస్ట్ సంస్థ ఏస్ ఈక్విటీస్ పేర్కొంది. ఇండియన్ మార్కెట్లు క్రమంగా అప్ ట్రెండ్ లోకి నడుస్తున్నాయని, ప్రతీ 10-15శాతం మార్కెట్ కరెక్షన్ల తరువాత స్టాక్స్ పిక్ చేసుకోడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుందని KIFS ట్రేడ్ క్యాపిటల్ CSO రితేష్ ఆషర్ అంటున్నారు.  యాక్సిస్ బ్యాంక్, అంబుజా సిమెంట్, అమృతాంజన్, అశోక్ లేల్యాండ్ వంటి కంపెనీలు క్రమంగా అప్ ట్రెండ్‌లోకి నడుస్తున్నాయని, అందుకే వీటిని ఇప్పుడున్న వాల్యూమ్‌లో కొనచ్చని రితేష్ సూచిస్తున్నారు. ఇవే స్టాక్స్ ను విదేశీ ఇన్వెస్టర్లు , మ్యూచువల్ ఫండ్స్ వారు హోల్డ్ చేస్తూ వస్తున్నారని ఆయన ఉదహరించారు. రానున్న రెండేళ్ళ కాలంలో ఇవి మంచి రిటర్న్స్ అందించనున్నాయని ఎనలిస్టుల భావన. క్రమానుగత పెట్టుబడులతో మ్యూచువల్ ఫండ్స్ లో నగదు లిక్విడిటీ పెరిగింది. మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నా మదుపర్లు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ICRA అంచనాల మేరకు  మ్యూచువల్ ఫండ్స్ లో ఈ అక్టోబర్ నాటికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్స్ (SIPs) రూ. 22.24 లక్షల కోట్లకు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ క్రమానుగత పెట్టుబడులు (SIPs) లాభసాటిగా కనబడుతున్నాయి. రెండేళ్ళ కోసం ఫండ్ మేనేజర్లు కూడా తమ పెట్టుబడులను పెంచుతున్నారు. సుమారు 33 స్టాక్స్ లో ఫండ్ మేనేజర్లు భారీగా పెట్టుబడులను పెట్టారు. వీటిలో ఇన్ఫోసిస్, రాణే హోల్డింగ్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, దివీస్ లాబ్స్, ITD సిమెంటేషన్ , ఈక్విటాస్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.

     

Disclaimer : పైన ఉదహరించిన సూచనలు ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ కొనే ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.Most Popular