స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఏవి కొనచ్చు..?

స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఏవి కొనచ్చు..?

దేశీయ మార్కెట్లలో  ఈ ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధభాగం పూర్తిగా మదుపర్లకు నష్టాలనే మిగిల్చింది. అక్కడక్కడా కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే లాభాలను గడించాయి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, రూపీ డాలర్‌తో మారకపు విలువ పతనం, మార్కెట్లో NBFCలకు నగదు కొరత వంటివి మార్కెట్‌ ను అస్థిర పరిచాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా IL&FS సంక్షోభం మార్కెట్లను మరింత కుదిపేసింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలు దాదాపు 44-80 శాతం వరకూ పతనాన్ని చవి చూశాయి. మిడ్ క్యాప్ సెన్సెక్స్ సూచీలు నేల చూపులు చూశాయి. మార్కెట్ ఎనలిస్టుల అంచనాల ప్రకారం మార్కెట్లో సరైన స్టాక్స్ ఎంచుకోడానికి ఇదే సరైన తరుణం.భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకొచ్చే  కొన్ని స్మాల్ , మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఇప్పుడు అందుబాటు ధరల్లో కదలాడుతున్నాయి. వీటిని ఇన్వెస్టర్లు పిక్ చేసుకుంటే రాబోయే రెండేళ్ళల్లో ఇవి లాభాలను ఇస్తాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కొనచ్చు...!


జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ...
ఈ కంపెనీ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం రెండో క్వార్టర్‌ కల్లా 8.8 శాతం మార్జిన్లను సాధించింది. ఎబిటా 5.5 శాతం పెరిగి 21.4 శాతానికి చేరింది. HDFC సెక్యూరిటీస్ అంచనా మేరకు ఈ జూబిలెంట్ ఫుడ్ వర్క్ రాబోయే ఆర్ధిక సంవత్సరం కల్లా  లాభాలను తెచ్చి పెట్టనుందని పేర్కొంది. డొమినోస్, డింకిన్ డోనట్ రిటైల్ అవుట్ లెట్లను రానున్న సంవత్సరంలో మరిన్ని పెంచనున్నట్టు కంపెనీ తెలిపింది. 2020 నాటికి కంపెనీ అవుట్ లెట్లు మూడు రెట్లు పెంచడమే టార్గెట్ గా కంపెనీ లక్ష్యాలను నిర్దేశించుకుంది.


JK పేపర్స్
గత నాలుగు క్వార్టర్లలో కంపెనీ లాభాలు 8.4 శాతం నుండి 14 శాతానికి పెరిగాయి. క్రమం తప్పకుండా స్థిరమైన వృద్ధిని చూపిస్తున్న స్మాల్ క్యాప్ కంపెనీల్లో JK పేపర్స్ అగ్రగామిగా ఉంది. ఉత్పాదక సామర్ధ్యం పెంచుకోనున్న ఈ కంపెనీలో పెట్టుబడులు లాభాలనిస్తాయని ఎడల్వీజ్ సెక్యూరిటీస్ భావిస్తుంది. గత 6 నెలల్లో చూస్తే... జేకే పేపర్స్ స్టాక్ దాదాపు 50 శాతం పెరిగింది.  సిర్పూర్‌లో మరో ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని.. 2019 నుండి ఇక్కడ ఉత్పత్తి మొదలౌతుందని జేకే పేపర్స్ పేర్కొంది.


మణప్పురం ఫైనాన్స్
గత సంవత్సరంతో పోలిస్తే..ఈ ఆర్ధిక సంవత్సరం మణుప్పురం ఫైనాన్స్ ఆదాయం 2.9 శాతం పెరిగింది. రేటింగ్ కంపెనీలు  మణప్పురం ఫైనాన్స్ స్టాక్స్ కు బై రేటింగ్స్ ఇచ్చాయి. రానున్న రెండేళ్ళల్లో కంపెనీ ఆదాయం పెరగొచ్చని, మణప్పురం బ్రాంచులు కూడా దేశ వ్యాప్తంగా విస్తరించనుండటంతో రెవిన్యూ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి.


రాడికో ఖైతాన్
యునైటెడ్ స్పిరిట్ కంపెనీని తలదన్ని మరీ లాభాలను ఆర్జించిన సంస్థగా రాడికో ఖైతాన్ (లిక్కర్ సంస్థ) ఈ ఆర్ధిక సంవత్సరం ప్రముఖంగా పేరొందింది. గత మూడు క్వార్టర్లలోనూ కంపెనీ ఉత్తమ ఫలితాలను వెల్లడించింది. గత మార్చ్ లో నికర లాభాలు 2.1శాతం పెరగగా, జూన్ క్వార్టర్‌కల్లా అవి 2.6శాతం పెరిగాయి.  ఏస్ ఈక్విటీస్ ఈ కంపెనీకి హోల్డ్ రేటింగ్స్ ఇచ్చింది. కోటక్, ఎమ్కే గ్లోబల్స్  బై రేటింగ్స్ ఇచ్చాయి. లిక్కర్ ముడి పదార్ధాల ధరలు తగ్గడం, డీలర్స్ నుండి డిమాండ్ ఎక్కువగా ఉండటం కంపెనీ లాభాలకు కారణంగా ఎనలిస్టులు పేర్కొన్నారు.


నోసిల్
జూన్ త్రైమాసికంలో నోసిల్ రెవిన్యూ రూ. 268.9 కోట్లు కాగా , ఈ సెప్టెంబర్ క్వార్టర్‌లో రెవిన్యూ రూ. 271.99 కోట్లకు పెరిగింది. నెట్ ప్రాఫిట్ 2 శాతం పెరిగింది. నెట్ సేల్స్ గ్రోత్ కూడా 22.05 శాతం పెరిగింది. రేటింగ్ సంస్థలు నోసిల్‌కు బై రేటింగ్స్ ఇచ్చాయి.


రత్నమణి మెటల్స్&ట్యూబ్స్
నవంబర్ 16 శుక్రవారం మార్కెట్లో రత్నమణి మెటల్స్ స్టాక్ 1.21 శాతం పెరిగి రూ. 880.65 వద్ద ట్రేడ్ అయింది. 2017-18లో కంపెనీ నెట్ రెవిన్యూ రూ. 1,789.81 కోట్లుగా ఉంది. గత సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రెవిన్యూ రూ. 730.33 కోట్లుగా ఉంది. రేటింగ్ సంస్థలు రత్నమణి మెటల్స్ కు బై రేటింగ్స్ ఇచ్చాయి.


డీసీఎం
గత ఆర్ధిక సంవత్సరం 2017-18 కి గాను కంపెనీ నెట్ ప్రాఫిట్స్ రూ. 970.58 కోట్లుగా ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో డీసీఎం కంపెనీ రెవిన్యూ రూ.277.78 కోట్లుగా ఉంది. రానున్న రోజుల్లో కంపెనీ పనితీరు గణనీయంగా మెరుగుపడనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. రేటింగ్ సంస్థలు కూడా డీసీఎం స్టాక్స్ కు బై రేటింగ్ ఇచ్చాయి.


Disclaimer: పైన ఉదహరించిన సలహాలు, సూచనలు నిపుణులు, ఎనలిస్టులు వ్యక్త పరిచినవి మాత్రమే. స్టాక్స్ కొనే ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.

 Most Popular