12నెలల్లో లాభాల కోసం 6 ట్రెండ్స్‌...

12నెలల్లో లాభాల కోసం 6 ట్రెండ్స్‌...

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లు లాభసాటిగా కనిపించలేదు. ఆయల్ ధరలు గందరగోళంగా మారడం, రూపీ మారకపు విలువ పతనం, IL&FS సంక్షోభం వంటివి మార్కెట్లను అస్థిర పరిచాయి. కానీ... రానున్న సంవత్సరం మార్కెట్లు కాస్త పుంజుకునే అవకాశం లేకపోలేదు. ఆయిల్ ధరలు దిగిరావడం, GST ఫలాలు కనబడే అవకాశం, రూపీ స్థిరత్వం వంటివి రానున్న రోజుల్లో మదుపర్ల పోర్ట్ ఫోలియోలో లాభాలను చూపించవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటం, వచ్చే సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటం కూడా మార్కెట్లలో ఆశావహ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే సమయంలో మార్కెట్ ఎనలిస్టులు ఓ 6 ట్రెండ్స్ ను ఫాలోకమ్మంటున్నారు. రాబోయే సంవత్సర కాలంలో స్టాక్స్ నుండి లాభాలను పిండుకోవాలంటే..ఈ ట్రెండ్స్ ను  ఖచ్చితంగా అనుసరించమనే చెబుతున్నారు.
ఫైనాన్షియల్ థీమ్స్ మీద ఫోకస్ చేయాలి...
IL&FS సంక్షోభం వల్ల డొమెస్టిక్ మార్కెట్లు పతనం కావడం మనం చూసాం.  పెద్ద పెద్ద నాన్ బ్యాంకింగ్ కంపెనీలకే నగదు లభ్యత దొరకకపోవడంతో అవి పతనావస్థకు చేరుకున్నాయి. ఒక వేళ ఈ NBFCలను బ్యాంకులు, RBI , ప్రభుత్వం ద్వారా నగదు లభ్యత కనుక దొరికితే మళ్లీ ఇవి పుంజుకునే ఛాన్స్ ఉంది.క్యాష్ లిక్విడిటీ లేని కంపెనీల్లో పెట్టుబడులు గాల్లో పెట్టిన దీపాలు గా మారుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.  కాబట్టి మార్కెట్లో నగదు ప్రవాహం విషయంలో మదుపర్లు తరుచూ పరిశీలించుకోవాలని , ఫైనాన్షియల్ ట్రెండ్ ను ఫాలో కావాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు.
కన్జంప్షన్ : ప్రీమియం వైపు వెళ్ళాల్సిన సమయం ఇదే..
ఈ పండుగ సీజన్లప్పుడు ప్రీమియం ఉత్పత్తులకే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దీపావళి సమయంలో కూడా ఎక్కువగా ప్రీమియం ప్రోడక్ట్సే అమ్ముడు బోయాయి. LCD టీవీలు, ప్రీమియం ఫీచర్లు ఉన్న టీవీలే ఎక్కువగా సేల్ అయ్యాయి. రిఫ్రిజిరేటర్ల విషయంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. GST రాక వల్ల FMCG రంగాల్లో ధరల అదుపు వచ్చిందని, వినియోగదారులు కూడా పెరిగారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాబట్టి ఏ ఏ వస్తువుల మీద డిమాండ్ ఉంది, వినియోగ దారులు ఎలాంటి ఉత్పత్తులు కొంటున్నారు అన్న ట్రెండ్‌ను కూడా ఫాలో అయితేనే ఆయా స్టాక్స్ ను మనం ఎంపిక చేసుకోవచ్చని ఎనలిస్టులు సూచిస్తున్నారు.
క్యాపెక్స్ సైకిల్‌ను కూడా పరిశీలించాలి...
ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థలో సామర్ధ్య వినియోగం మెరుగు పడటంతో ఇండస్ట్రియల్ పెట్టుబడుల విస్తరణ (క్యాపెక్స్)  కూడా పెరిగింది. మెటల్ , పవర్ రంగాల్లో క్యాపెక్స్ తగ్గినప్పటికీ, ఆర్డర్ బుక్‌ల నిర్వాహణ మాత్రం పరిశ్రమలు, రోడ్లు, అర్బన్ ఇన్ఫ్రాల వల్లే నడపబడుతున్నాయి. రానున్న ఎన్నికల తీర్పులు  ఈ పరిణామాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఎన్నికల తరువాతే కంపెనీల క్యాపిటలైజేషన్ పెంచుకోడంలో  తీసుకోనున్న విధానాలు ఫిక్స్ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలు మార్కెట్లపై పెను ప్రభావాన్నే చూపిస్తాయని ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్ధ్ సెడానీ అంటున్నారు. కాబట్టి కంపెనీల క్యాపెక్స్ సైకిల్ ను కూడా పరిశీలిస్తూ ఉండాలని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.  
FMCG: వినియోగ వస్తువుల కంపెనీల లాభాలను ఫాలో అవ్వాలి..
2019 ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధభాగంలో FMCG కంపెనీల వాల్యూమ్ గ్రోత్ ఆకర్షణీయంగానే ఉంది. మార్కెట్లలో అనిశ్చితి కనబడినప్పటికీ..  ఈ స్టాక్స్ మెరుగైన రిటర్న్స్ నే అందించాయి. టాటా మ్యూచువల్ ఫండ్స్ అంచనా ప్రకారం  FMCG కంపెనీల స్టాక్స్ రానున్న రోజుల్లో అధిక లాభాలను తీసుకొస్తాయి. స్థానికంగా వినియోగ దారులకున్న డిమాండ్స్ , వారు ఎలాంటి ఉత్పత్తులవైపు ఆకర్షితులవుతున్నారన్న ట్రెండ్ ను కూడా ఫాలో అవ్వాలంటున్నారు ఎనలిస్టులు.
రిడంప్షన్స్ వైపు కూడా చూడాలి...  
మార్కెట్లు బలపడటానికి, స్థిరంగా ఉండటానికి డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా  పెడతారు. ఈ ఫ్లోటింగ్ లో ఎక్కడైనా మార్పులు జరుగుతున్నాయన్న సంకేతాలు వచ్చాయంటే అవి మార్కెట్‌కు , మదుపర్ల పోర్ట్ ఫోలియోకీ మంచిది కాదనే ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. దేశీయ మదుపర్లు లేదా డొమెస్టిక్ సంస్థాగత ఇన్వెస్టర్లు 2018 నవంబర్ 12 నాటికి రూ.1,05,845 కోట్ల పెట్టుబడులను స్టాక్స్ మీద పెట్టారు. ఇదే సమయం నాటికి ఫారిన్ ఇన్వెస్టర్లు (FIIs ) రూ 44,273 కోట్ల విలువగల స్టాక్స్ ను వదిలించుకున్నారు.  ఈ రిడంప్షన్స్ మీద కూడా మదుపర్లు దృష్టిని కేంద్రీకరించాలి.

IT రంగంలో ఖాళీలను గమనించండి...
అధిక US రేట్లు, వాణిజ్య విధానాలు మార్కెట్ల ఆర్ధిక శక్తులను ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడి, రూపీ పతనం అయినప్పుడు IT స్టాక్స్ పుంజుకోడం మనం చూస్తుంటాం. అలాగే గ్లోబల్ మార్కెట్లలో జరిగే పరిణామాలకు వెంటనే ప్రభావానికి లోనయ్యేది కూడా IT స్టాక్సే. వీటి విషయంలో కూడా జాగురుకతతో ఉంటే ఆయా స్టాక్స్ కూడా మంచి ఎంపికగా మారే అవకాశం ఉందని టాటా మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.
Disclaimer
పైన సూచించిన సలహాలు మార్కెట్ ఎనలిస్టులు, విశ్లేషకుల సూచనలు మాత్రమే. స్టాక్స్ ఎంపిక చేసుకునే ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.

 Most Popular