ప్రెస్ బటన్‌ క్రెడిట్ కార్డులొచ్చేశాయ్...

ప్రెస్ బటన్‌ క్రెడిట్ కార్డులొచ్చేశాయ్...

ఇండస్ బ్యాంక్  బటన్‌లతో కూడిన కొత్త క్రెడిట్ కార్డ్ ( Nexxt credit card )ను విడుదల చేసింది. దేశంలోనే తొలి సారిగా ఈ బటన్ ప్రెస్ సాంకేతికతతో కూడిన కార్డులను జారీ చేసిన బ్యాంక్ గా ఇండస్ బ్యాంక్ నిలిచింది. ఈ కొత్త క్రెడిట్ కార్డ్‌లో మూడు సార్లు పేమెంట్ ఆప్షన్, పాయింట్ ఆఫ్ సేల్ (POS) టెర్మినల్, నెలవారీ వాయిదాల కోసం  క్రెడిట్ , EMI మార్పు వంటి సదుపాయాలను కల్పించింది. బ్యాంకు కు నేరుగా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే క్రెడిట్ కార్ట్ మీదున్న బటన్స్ నొక్కడం ద్వారా పేపర్ రహిత లావాదేవీలు చిటికెలో పూర్తవుతాయని బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి.
అమెరికాకు చెందిన డైనమిక్ ఇన్ కార్ప్ భాగస్వామ్యంతో ఈ కొత్త క్రెడిట్ కార్డ్‌లను రూపొందించినట్టు ఇండస్ బ్యాంక్ తెలిపింది. ఈ కార్డుల్లో బ్యాటరీ ఆధారిత సిస్టం, లెడ్ లైట్ బటన్స్ ప్రత్యేకంగా ఉంటాయని పేర్కొంది. ఈ క్రెడిట్ కార్డ్ వినిమయంలో రివార్డ్ పాయింట్లు కూడా కేటాయిస్తామని ఇండస్ బ్యాంక్ పేర్కొంది.

 Most Popular