క్యూ2 ఎఫెక్ట్‌?- అశోక్‌లేలాండ్ పతనం

క్యూ2 ఎఫెక్ట్‌?- అశోక్‌లేలాండ్ పతనం

దేశీ ఆటో రంగ దిగ్గజం అశోక్‌ లేలాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. మంగళవారం మార్కెట్లు ముగిశాక పనితీరును వెల్లడించింది. ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో కంపెనీ రూ. 460 కోట్ల నికర లాభం ఆర్జించగా.. మొత్తం ఆదాయం రూ. 7608 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 806 కోట్లుకాగా... ఇబిటా మార్జిన్లు 10.6 శాతంగా నమోదయ్యాయి. కాగా.. అశోక్‌ లేలాండ్‌ ప్రస్తుత ఎండీ, సీఈవో వినోద్‌ దాసరి మార్చి 2019 నుంచి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ధీరజ్‌ హిందుజా వెనువెంటనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలియజేసింది. 

Image result for thumbs down

షేరు వీక్‌
ఫలితాలు, వినోద్‌ దాసరి రాజీనామా వార్తల నేపథ్యంలో అశోక్‌ లేలాండ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 8 శాతం కుప్పకూలింది. రూ. 110 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 114 వద్ద గరిష్టాన్నీ, రూ. 109 దిగువన కనిష్టాన్నీ తాకింది. కాగా.. ఫలితాల వెల్లడికి ముందు మంగళవారం అశోక్‌ లేలాండ్‌ షేరు 0.4 శాతం బలపడి రూ. 119 వద్ద ముగిసింది. Most Popular