- వ్యూహాత్మక భాగస్వామికి సంస్థలో 50 శాతం వాటాను విక్రయించే యోచనలో జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్లు
- తన పదవికి రాజీనామా చేసిన అశోక్ లేలాండ్ ఎండీ, సీఈఓ వినోద్ కె దాసరి
- వచ్చే ఏడాది మార్చి 31 నుంచి అమల్లోకి రానున్న వినోద్ కె దాసరి నిర్ణయం
- వివిధ హోదాల్లో 14 ఏళ్లపాటు అశోక్ లేలాండ్లో సేవలందించిన వినోద్ కె దాసరి
- క్యూ-2లో 37 శాతం వృద్ధితో రూ.460 కోట్లుగా నమోదైన అశోక్ లేలాండ్ నికరలాభం
- అల్యూమినియం ఉత్పత్తిని పెంచేందుకు నోవలీస్ $175 మిలియన్లను ఇన్వెస్ట్ చేయనుందని ప్రకటించిన హిందాల్కో
- బీపీసీఎల్ కొత్త సీఎఫ్ఓగా ఎన్.విజయగోపాల్ నియామకం, నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం
- రూ.3,270 కోట్లు విలువ చేసే 3 ప్రాజెక్టులను పూర్తి చేసి అంగీకార లేఖలను అందుకున్న దిలీప్ బిల్డ్‌కాన్
- అవెన్యూ ధెరాప్యూటిక్స్ను రూ.1560 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిప్లా అనుబంధ సంస్థ ఇన్వాజెన్ ఫార్మా ఒప్పందం
- ఆస్ట్రేలియా, హాంకాంగ్‌ల నుంచి తమ కొత్త రసాయనానికి పేటెంట్లు లభించినట్లు తెలిపిన సువెన్ లైఫ్
- ఆస్త్మా చికిత్సలో వినియోగించే సిప్లాకు చెందిన బుడెసోనైడ్ ఇన్హేలేషన్ యాంపూల్స్కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి
- ఉద్యోగులకు షేర్లు జారీ చేయడం ద్వారా రూ.600 కోట్ల నిధులను సమీకరించేందుకు యూనియన్ బ్యాంక్ బోర్డ్ గ్రీన్‌సిగ్నల్
- పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో సంయుక్త వాటా విక్రయ ప్రక్రియ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన కార్లైల్ గ్రూప్
- Q2లో మూడు రెట్లు పెరిగిన టాటా స్టీల్ లాభం, రూ.3116 కోట్లుగా నమోదైన నికరలాభం
- రెండో త్రైమాసికంలో రూ.1035 కోట్ల నష్టం నుంచి రూ.103 కోట్ల లాభాన్ని ప్రకటించిన కార్పొరేషన్ బ్యాంక్
- క్యూ-2లో 4 శాతం వృద్ధితో రూ.146 కోట్లుగా నమోదైన అపోలో టైర్స్ నికరలాభం
- గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ-2లో 24శాతం వృద్ధితో రూ.636 కోట్లుగా నమోదైన ఎన్ఎండీసీ నికరలాభం
- టాటా గ్రూప్ తమ సంస్థను టేకోవర్ చేస్తుందనే వార్తలను ఖండించిన జెట్ ఎయిర్వేస్
స్టాక్స్ ఇన్ న్యూస్.. (నవంబర్ 14)
