వింధ్యా టెలీ-క్యూ2 కిక్‌- ఇండొకొ డీలా

వింధ్యా టెలీ-క్యూ2 కిక్‌- ఇండొకొ డీలా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎంపీ బిర్లా గ్రూప్‌ సంస్థ వింధ్యా టెలీలింక్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో ర్యాలీ కొనసాగుతోంది. అయితే మరోవైపు ఇదే కాలానికి పనితీరు నిరాశపరచడంతో దేశీ హెల్త్‌కేర్‌ సంస్థ ఇండొకొ రెమిడీస్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వివరాలు చూద్దాం..

వింధ్యా టెలీలింక్స్‌ 
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో వింధ్యా టెలీలింక్స్‌ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 5.6 కోట్లకు చేరగా... మొత్తం ఆదాయం సైతం 93 శాతం పెరిగి రూ. 566 కోట్లను అధిగమించింది. ఈ ఏడాది క్యూ1లోనూ కంపెనీ పటిష్ట ఫలితాలను ప్రకటించడంతో కొంతకాలంగా ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోలుకి ఆసక్తి చూపుతూ వస్తున్నారు. దీంతో ఈ ఏడాది జులై 19న నమోదైన రూ. 911 కనిష్ట ధర నుంచీ ఈ షేరు 111 శాతం ర్యాలీ చేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో వింధ్యా టెలీలింక్స్‌ షేరు 4.4 శాతం జంప్‌చేసి రూ. 1862 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1912 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. కంపెనీ ప్రధానంగా  కేబుల్స్‌(ఆప్టికల్‌ ఫైబర్‌), ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది.

Image result for indoco remedies

ఇండొకొ రెమిడీస్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఇండొకొ రెమిడీస్‌ రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. వెరసి క్యూ2లో దాదాపు రూ. 8 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2017-18) క్యూ2లో రూ. 20 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం క్షీణించి రూ. 236 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం 71 శాతం నీరసించి రూ. 12 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఇండొకొ షేరు 3.3 శాతం నష్టంతో రూ. 179 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 189 వద్ద గరిష్టాన్ని, రూ. 170 వద్ద కనిష్టాన్నీ తాకింది.Most Popular