టెక్నికల్ సపోర్ట్ - 3 వారాల్లో ఈ స్టాక్స్‌కు లాభాలు..?

టెక్నికల్ సపోర్ట్ - 3 వారాల్లో ఈ స్టాక్స్‌కు లాభాలు..?

గత మూడు నెలలుగా మార్కెట్లు అనిశ్చితికి గురయ్యాయి. దివాలీ కొత్త సంవత్ ప్రారంభం అయ్యాక స్టాక్స్ కొనడానికి కొంత సానుకూలత కనడబడుతుంది. గత వారం BSE సెన్సెక్స్ 0.42శాతం పెరిగి 146 పాయింట్ల పెరుగుదలతో 35,158 వద్ద నిలిచింది. ఇది మరింత వృద్ధిని కనబరుస్తుందని మార్కెట్ విశ్లేషకుల భావన. అలాగే NSE నిఫ్టీ కూడా 32.20 పాయింట్లు లాభ పడింది. గత వారం నిఫ్టీ 10,585 వద్ద నిలిచింది. నేటి సోమవారం మార్కెట్లలో నిఫ్టీ 10,620 ను తాకింది. " నిఫ్టీ 10,710 క్రిటికల్ నిరోధం వద్ద బుల్స్ ఊపందుకోనున్నారని , పలు రంగాల స్టాక్స్ ను పిక్ చేయనున్నా"రని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు , ఛార్ట్ వ్యూ ఇండియా ఛీఫ్ స్ట్రాటజికల్ రీసెర్చర్ మజహర్ మహ్మద్ పేర్కొన్నారు. మార్కెట్లలో కొత్త స్టాక్స్‌ను ఎంచుకోడానికి ఇదే సరైన సమయమని ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రముఖ ఛార్టిస్టులు, బ్రోకరేజ్ సంస్థల ఎనలిస్టుల అంచనాల ప్రకారం రానున్న మూడు వారాల్లో (15-21 సెషన్స్ లో ) ఓ పది స్టాక్స్ లాభాలను తీసుకోస్తాయని భావిస్తున్నారు. అవేంటో చూద్దామా...
లార్సెన్&టుబ్రో :  బై" : టార్గెట్ ధర రు. 1,500 : స్టాప్ లాస్ : రు. 1,295
ఈ స్టాక్ 2018లో త్రికోణాకారంలో ట్రేడ్ అయింది. లార్సెన్ టుబ్రో షేర్ ధర పుంజుకోవచ్చని సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఇండెక్స్ సూచీల్లో  ఈ స్టాక్ RS లైన్ కూడా వేగంగా పురోగమిస్తుంది. గత 50 వారాల గరిష్టానికి ఇది తాక వచ్చని కూడా ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రైస్ ఆక్సిలరేటర్ (PPO) కూడా సానుకూల సంకేతాలనే ఇస్తుంది. రానున్న రోజుల్లో ఈ స్టాక్‌ కౌంటర్లు అమ్మకాల ఒత్తిళ్లకు లోనవ్వవనే మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరో మూడు వారాల్లో ఈ L&T స్టాక్స్ లాభాల బాట పట్టొచ్చని ఎనలిస్టుల భావన.
జమ్నా ఆటో :  బై" : టార్గెట్ ప్రైస్‌ రు. 92 : స్టాప్ లాస్ : రు. 69
మార్కెట్ కరెక్షన్లలో జమ్మా ఆటో షేర్ రు. 102 నుండి కొద్దిగా క్షీణించింది. 50 వారాల కనిష్టానికి సగటున ఈ స్టాక్ పడింది. ఆ తరువాత కాస్త పుంజుకుని రు. 67-72 వద్ద ట్రేడ్ అయింది. CNX500 బోర్డర్‌లో RS లైన్ వేగంగా ముందుకెళ్తుంది. 50-WMA లైన్‌కు కూడా క్రాస్ చేయడం కనబడుతుంది. రానున్న రోజుల్లో జమ్నా ఆటో మరింత మెరుగైన ఫలితాలను కనబరచనుందని స్టాక్ ఎనలిస్టులు భావిస్తున్నారు. కొత్తగా ఈ స్టాక్ ను కొనుగోలు చేయడానికి ట్రేడర్లు , ఇన్వెస్టర్లు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
స్టార్ పేపర్ : బై " : టార్గెట్ ధర రు. 210: స్టాప్ లాస్ ; రు. 174
మార్కెట్లలోని పుల్ బ్యాక్ ర్యాలీలను తట్టుకుని మరీ స్టార్ పేపర్ స్టాక్స్ నిలిచాయి. నిలకడైన వృద్ధిని కనబరచడంతో బాటు కంపెనీ 100-డే మూవింగ్ యావరేజ్‌ను అధిగమించింది. పోజీషనల్ ట్రేడర్స్ కు ఎనలిస్టులు ఈ స్టాక్‌ను కొనమనే సలహానిస్తున్నారు.

ఆంధ్ర సుగర్స్ : బై' : టార్గెట్ ధర రు. 447 : స్టాప్ లాస్ ; రు.360
100-డే మూవింగ్ యావరేజ్‌ను దాటడంతో బాటు ఆంధ్ర సుగర్స్ స్టాక్స్ రానున్న రోజుల్లో మంచి లాభాలను తీసుకురానున్నాయనే స్టాక్ ఎనలిస్టులు భావిస్తున్నారు. కంపెనీ గ్రోత్ నిలకడగా ఉండటం, చక్కెర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోడంతో ఈ సుగర్ రంగంలోని స్టాక్స్ ప్రాఫిట్స్ ను పిక్ చేస్తాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో తాజా పుల్‌బ్యాక్‌ను తట్టుకుని మరీ నిలబడ్డ ఆంధ్ర సుగర్స్ స్టాక్స్ టార్గెట్ ప్రైస్‌గా రు. 447గా పేర్కొన్నారు.
పవర్ గ్రిడ్  :  బై " : టార్గెట్ ప్రైస్ రూ. 203 : స్టాప్ లాస్ రూ.184 :
మార్కెట్ బ్రేక్ అవుట్ సమయంలో పవర్ గ్రిడ్ స్టాక్ కౌంటర్‌లో పురోగతి కనబడతుంది. ప్రస్తుతం ఈ స్టాక్ రు. 185-192 వద్ద టార్గెట్ అవుతున్నా.. రానున్న మూడు వారాల్లో దీని టార్గెట్ ధర రు. 203 వరకూ రావొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.
అరబిందో ఫార్మా : బై" : టార్గెట్ ప్రైస్‌ రూ. 855 : స్టాప్ లాస్ : రూ. 797
అరబిందో కౌంటర్లో కొనుగోళ్లు పెరుగుతున్నాయి గత వారం రోజులుగా. MACD మోమెంటమ్‌ను అధిగమించి మరీ కొనుగోళ్ళు జరుగుతుండటంతో ఎనలిస్టులు అరబిందో మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. అరబిందో ఉత్పత్తుల అమ్మకాలు  గ్లోబల్ మార్కెట్లలో గణనీయంగా పెరగడంతో పారెక్స్  రెవిన్యూ పెరిగింది. రానున్న మూడు వారాల్లో దీని టార్గెట్ ప్రైస్‌ రూ.855 గా ఎనలిస్టులు పేర్కొంటున్నారు.
ఎవరెడీ ఇండస్ట్రీస్ : బై : టార్గెట్ ప్రైస్‌ రూ.220 : స్టాప్ లాస్ : రూ. 185
మార్కెట్ల పతనం నుండి ఎవరెడీ ఇండస్ట్రీస్ బ్రేక్ అవుట్ సాధించింది. గత వారాంతపు ఛార్ట్స్‌లో పాజిటివ్ క్లోజింగ్ దక్కింది ఎవరెడీకి. MACD సూచికల్లో కూడా కొనుగోళ్ళ ఊపు కనిపించింది. అందుకే ప్రముఖ ఛార్టిస్టులు , బ్రోకరేజ్ సంస్థల వారు ఈ స్టాక్ ను పిక్ చేసుకోమని సలహా ఇస్తున్నారు.
హెక్సావేర్ : బై" :  టార్గెట్ ప్రైస్‌ రూ. 347.70 : స్టాప్ లాస్ : రూ. 308
వారాంతపు ఛార్ట్‌ల్లో హెక్సావేర్ పాజిటివ్ క్లోజింగ్ జరిపింది. MACD మూమెంటమ్స్ కూడా ఈ స్టాక్ కొనుగోలు వైపే మొగ్గు చూపుతున్నాయి. డైలీ ఛార్ట్‌లో స్టాక్ రైజింగ్ కనబడుతుంది. అందుకే ఎనలిస్టులు ఈ స్టాక్స్ రానున్న 3 వారాల్లో లాభాలను చూపుతాయని భావిస్తున్నారు.
మారుతీ సుజుకీ :  బై' : టార్గెట్ ప్రైస్ రూ.7,670 : స్టాప్ లాస్ :  రూ.7,080
అవర్స్ ఛార్ట్‌లో మారుతీ సుజుకీ స్టాక్స్ బ్రేక్ అవుట్ సాధించాయి. హెడ్ ఎండ్ షోల్డర్ ఫార్మేషన్‌లో ఈ స్టాక్ నమోదు అయింది. ఈ కౌంటర్‌లో కొనుగోళ్లు బుల్లిష్ తరహాలో జరగడంతో ఎనలిస్టులు దీని టార్గెట్ ధరగా రూ. 7,650 గా పేర్కొంటున్నారు.  ఛార్టిస్టులు ఈ స్టాక్ మరో 3 వారాల్లో లాభాల్లో నమోదు అవుతుందని విశ్వసిస్తున్నారు.
ఫినొలెక్స్ కేబుల్స్ :  బై " : టార్గెట్ ప్రైస్ రూ. 560 : స్టాప్ లాస్ : రూ. 510
ఫినొలెక్స్ స్టాక్ గత 21 రోజుల గరిష్టానికి ట్రేడ్ అవుతోంది. అంటే రు. 496 వద్ద షేర్ ట్రేడ్ అవుతోంది. దీంతో ఈ స్టాక్‌ మీద ఇన్వెస్టర్లకు సానుకూల ధోరణి ప్రబలుతుంది.  సూచీల్లో సగటు కంటే ఎక్కువగా స్టాక్ నమోదు కావడంతో బాటు స్థిరమైన వృద్ధిని కనబరుస్తుంది. అందుకే ఈ షేర్ వాల్యూ కూడా రానున్న 3 వారాల్లో లాభాలను చూపిస్తుందని ఎనలిస్టుల అంచనా.
Disclaimer : పైన ఉదహరించిన సూచనలు, సలహాలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, వాటి నిపుణులు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక చేసుకునే ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.
 

 

 Most Popular