Q2 మిశ్రమం.. అయినా ఈ స్టాక్స్ కొనొచ్చు..!

Q2  మిశ్రమం.. అయినా ఈ స్టాక్స్ కొనొచ్చు..!

ఈ సెప్టెంబర్ రెండో త్రైమాసిక ఫలితాలను పలు కంపెనీలు ప్రకటించేశాయి. వాటిలో కొన్ని ఉత్తమ ఫలితాలను చూపగా మరి కొన్ని మిశ్రమ ఫలితాలను వెలువరించాయి. అయినప్పటికీ ఆయా కంపెనీల భవిష్యత్తు, వృధ్ధి రేటు రానున్న సంవత్సరంలో గణనీయంగా మెరుగు పడొచ్చనే మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వాటి పనితీరుకు మరో సంవత్సర కాలం పట్టొచ్చని, ఇదే సమయంలో ఆయా కంపెనీల స్టాక్స్ లాభాల బాట పట్టొచ్చని వారు అంచనా వేస్తున్నారు. సిమెంట్ రంగంలో కంపెనీల క్వార్టర్ -2 ఫలితాలు నెమ్మదించినా.. రానున్న కాలంలో సిమెంట్ రంగం శరవేగంగా కోలుకుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. FMCG లు కూడా ఈ క్వార్టర్ ఫలితాలలో  నిరాశ పరిచినా రాబోయే క్వార్టర్‌ కల్లా అవి కూడా పుంజుకోనున్నాయి.
మొత్తం ఆదాయ వృద్ధి పధ్ధతి ఇప్పటికీ అధీనంలో ఉందనీ,  ఆదాయం పునరుద్దరణను ధ్రువీకరించడానికి కనీసం మరో క్వార్టర్లో బలమైన పనితీరు అవసరమవుతుందని ప్రముఖ స్టాక్ విశ్లేషకులు , ఎడల్వీస్ ఇన్వెస్ట్ మెంట్స్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ భావిస్తున్నారు. రానున్న సంవత్సరంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో , సిమెంట్, మెటల్ రంగాలు మంచి పనితీరును కనబరుస్తాయని ఎనలిస్టులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మిడ్ క్యాప్ రంగం జోరందుకోనుందని, మార్కెట్ కరెక్షన్లు, IT, ఫార్మా రంగాల లో పెర్‌ఫార్మెన్స్ కూడా వీటికి కలిసొస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, స్టాక్ ఎనలిస్టులు రానున్న ఆర్ధిక సంవత్సరం చివరికి ఉత్తమ ఫలితాలను, ఎక్కువ రిటర్న్స్ ను ఇచ్చే ఓ 15 స్టాక్స్ ను సూచిస్తున్నారు. అవేంటో చూద్దామా...!


కోటక్ మహీంద్రా బ్యాంక్
CLSA అంచనాల ప్రకారం కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్స్ ను పిక్ చేసుకోడం ఉత్తమం. రానున్న సంవత్సర కాలంలో  ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ రు. 1,420 - 1,480 వరకూ పేర్కొన్నారు. గత త్రైమాసిక ఫలితాల్లో ప్రాఫిట్స్ పెరుగుదల ఉన్నా.. బ్యాంకుకు పెట్టుబడులు తగ్గాయి. కానీ కంపెనీ స్ట్రాంగ్ CASA, క్యాపిటలైజేషన్ రాబోయే రోజుల్లో ఈ షేర్‌ను నిలబెడతాయని CLSA స్టాక్ బ్రోకింగ్ సంస్థ అంచనా వేస్తుంది.


మ్యారికో..
స్టాక్ ర్యాంకింగ్ సంస్థలు ఈ మ్యారికో షేర్లకు 'అవుట్ పెర్ఫార్మింగ్' నుండి 'న్యూట్రల్' రేటింగ్ ను ఇచ్చాయి. ఎనలిస్టులు మారికో స్టాక్స్ టార్గెట్ ధర రు. 331 నుండి రు. 376 కు పెంచారు. 2019 ఆర్ధిక సంవత్సరం రెండో అర్ధభాగం కల్లా ఈ కంపెనీ ఉత్తమ పనితీరును కనబరచనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


IRB ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలపర్స్
క్రెడిట్ రేటింగ్ సంస్థలు IRB ఇన్ఫ్రా కు నూట్రల్ నుండి అండర్ పెర్ఫార్మింగ్ కు  రేటింగ్‌ను తగ్గించారు. కానీ రానున్న కాలంలో కంపెనీకున్న బలమైన ఆర్డర్లు, కంపెనీ క్యాపిటలైజేషన్ వంటివి బలోపేతం చేయనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. IRB ఇన్ఫ్రా టార్గెట్ ధర, రు. 165 నుండి రు. 220 వరకూ పెంచారు విశ్లేషకులు.


యునైటెడ్ స్పిరిట్స్
మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఈ లిక్కర్ తయారీ సంస్థకు ఓవర్ వెయిట్ రేటింగ్‌ను ఇచ్చింది. యునైటెడ్ స్పిరిట్ స్టాక్స్ టార్గెట్ ధరగా రు. 650 నుండి రు.700 కు పెంచారు స్టాక్ ఎనలిస్టులు. రాబోయే కాలంలో కంపెనీ పనితీరు మెరుగుపడనుందని వారి అంచనా.


JSW స్టీల్
ఎమ్‌కే సంస్థ  JSW స్టీల్‌కు ' ఎక్యుమిలేట్ '  రేటింగ్ ఇచ్చింది. అంతే కాకుండా JSW స్టీల్ టార్గెట్ ధరను రు. 352 నుండి రు. 402 వరకూ పెంచేసింది. రాబోయే కాలంలో స్టీల్ ఆధారిత రంగాల్లో పురోగతి ఉండనుండటమే దీనికి కారణంగా పేర్కొన్నారు.


భారతీ ఎయిర్ టెల్
 దేశంలోని రెండో అతి పెద్ద మొబైల్ ఆపరేటర్ భారతీ ఎయిర్ టెల్ కు దైయిచీ బ్యాంక్ ' బై ' నుండి " హోల్డ్ " రేటింగ్స్ ను ఇచ్చింది.  ఎయిర్ టెల్ తన వ్యాపారాన్ని ఆఫ్రికాకు కూడా విస్తరించడంతో ఆ కంపెనీ రెవిన్యూ వృద్ధి చెందుతుంది. ఇదే అంచనాలతో ఎయిర్ టెల్ టార్గెట్ ధర రు. 425 గా పేర్కొంటున్నారు ఎనలిస్టులు. కంపెనీకి ప్రధానంగా రిలయన్స్ జియోతో పోటీ ఉన్నప్పటికీ.. కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఆకర్షణీయంగా ఉంది. 4 బిలయన్ డాలర్ల ఫండ్ ఉండటంతో బాటు కాపెక్స్ శాతం కూడా బాగుంది.


అదానీ పోర్ట్స్
మెక్ క్వారీ సంస్థ అదానీ పోర్ట్‌కు అవుట్ పెర్ఫార్మ్ నుండి న్యూట్రల్ రేటింగ్స్ ను ఇచ్చింది. కానీ టార్గెట్ ధరను మాత్రం రు. 383 నుండి రు. 358 వరకూ కుదించింది. 2019-2021 ఆర్ధిక సంవత్సరాల్లో అదానీ పోర్ట్స్ విశేష పనితీరును కనబరచనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఆదాయ వృద్ధి 5 శాతం పెరిగే ఛాన్స్ కూడా ఉందని ఎనలిస్టుల భావన.


మైండ్ ట్రీ
JP మోర్గాన్ సంస్థ మైండ్ ట్రీ రేటింగ్స్ ను ' ఓవర్ వెయిట్ ' రేంజ్ కు పెంచింది. టార్గెట్ ధర గా రు. 1,050 గా నిర్ణయించింది. 2019 ఆర్ధిక సంవత్సరం  రెండో త్రైమాసిక ఫలితాలు బాగుండటంతో మైండ్ ట్రీ IT కంపెనీ పనితీరు బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  


HDFC బ్యాంక్
ఎక్వారిస్ సంస్థ HDFC బ్యాంక్ రేటింగ్స్ ను 'లాంగ్' నుండి 'యాడ్ ' కు పెంచింది.  అలాగే టార్గెట్ ధరను రు. 2,320 నుండి రు. 2,340 కు పెంచింది. రానున్న FY20 వరకూ  బ్యాంక్ 20 నుండి 23 శాతం నికర వృద్ధిని సాధించనున్నట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు.


NIIT టెక్నాలజీస్
క్రెడిట్ సూసీ   ఈ NIIT  టెక్నాలజీస్ రేటింగ్స్ ను అవుట్ పెర్ఫార్మింగ్ నుండి న్యూట్రల్ కు పెంచింది. టార్గెట్ ధరను రు. 1,250 నుండి రు. 1,375 కు పెంచింది. గత క్వార్టర్ ఫలితాలలో NIIT టెక్నాలజీస్ ఉత్తమ ఫలితాలను కనబరచింది. అంతే కాకుండా రానున్న ఆర్ధిక సంవత్సరంలో ఎర్నింగ్ అంచనాలు 11-12 శాతం పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


హెక్సావేర్ టెక్నాలజీస్
మేబ్యాంక్ సంస్థ  హెక్సావేర్ టెక్ కంపెనీకి "బై"  నుండి " హోల్డ్ " రేటింగ్స్ ను ఇచ్చింది. కంపెనీ చేతిలో పలు ప్రముఖ కాంట్రాక్టులు ఉండటంతో రానున్న క్వార్టర్‌లో రెవిన్యూ గ్రోత్ 4.6 శాతం పెరగొచ్చని రేటింగ్ సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. అంతే కాకుండా EBIT మార్జిన్లు కూడా 120 పాయింట్లు పెరిగి 15.2 శాతంగా ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు.