ఇకపై రివ్వున ఎగిసే ఆ.. 18 స్టాక్స్ !

ఇకపై రివ్వున ఎగిసే ఆ.. 18 స్టాక్స్ !

2006 నుండి  ఓ 16 సందర్భాల్లో 10 శాతం కరెక్షన్లను ఎదుర్కొంది నిఫ్టీ. 2008 లో గ్లోబల్ ఫైనాన్షియల్ సంక్షోభం అప్పుడు కూడా నిఫ్టి దిద్దుబాటు చర్యలతో నిలదొక్కుకోగలిగింది. ప్రముఖ స్టాక్ ఎనిలిస్ట్ కంపెనీ ఎలరా క్యాపిటల్ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో మార్కెట్లు సానుకూల, ఆశావహ దృక్పథంతో నడుస్తాయని పేర్కొంది. పోస్ట్ కరెక్షన్ సమయంలో నిఫ్టీ మూడు నెలల కాలంలోనే రీబౌండ్ అయి 15శాతం ప్రాఫిట్స్ ను చూపించింది. మన దేశీయ మార్కెట్లలో ఎన్ని అటుపోట్లు వచ్చినా తొందరగా కోలుకునే స్వభావం ఉందని ఎలరా క్యాపిటలర్ తన సర్వేలో పేర్కొంది. వేగంగా కోలుకునే మార్కెట్లలో దేశీయ మార్కెట్లు అగ్రగామిగా నిలుస్తాయని ఎలారా క్యాపిటల్ భావిస్తుంది.

అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు గమనిస్తే.. మంచి, లాభాదాయక స్టాక్స్ ఎంపికకు ఇది సరైన తరుణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వాల్యూషన్ కంఫర్ట్ ఉండటం, నిఫ్టీ 5 శాతం పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, INR     తరుగుదలలో కాస్త తగ్గింపు కనబడటం , IT , ఫార్మా రంగాలు అండర్ పెర్ఫార్మెన్స్ కనబరచడం వంటి అంశాలు రానున్న రోజుల్లో స్టాక్స్ లాభాలను చవి చూడటానికి దోహదం చేస్తాయని ఎలరా క్యాపిటల్ అంచనా వేస్తుంది. సాధారణంగా IT, ఫార్మా రంగాలు అండర్ పెర్ఫామ్ చేస్తున్న దశలో మెటల్స్, బ్యాంకింగ్ రంగాలు  మెరుగ్గా రాణిస్తాయి. ఇదే సూత్రంతో ప్రముఖ స్టాక్ విశ్లేషకులు ఈ కింది స్టాక్స్ రానున్న రోజుల్లో లాభాల బాటలో పయనించవచ్చని సూచిస్తున్నారు.
1.) HDFC బ్యాంక్
2.) బజాజ్ ఫైనాన్స్
3.) ఇండస్ ఇండ్ బ్యాంక్
4.) ఎస్ బ్యాంక్
5.) Zee ఎంటర్‌టైన్మెంట్
6.) హావెల్స్ ఇండియా
7.) యునైటెడ్ బ్రూవరీస్
8.) శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్
9.) LIC హౌసింగ్
10) ఎక్సైడ్
11) చోళ మండలం  
12) రామ్‌కో సిమెంట్
13) టాటా గ్లోబల్
14) సుప్రీం ఇండస్ట్రీస్
15) సెంచురీ టెక్స్‌టైల్స్
16) అజంతా ఫార్మా
17) దివాన్ హౌజింగ్
18) రిలయన్స్ క్యాపిటల్
ఎలారా క్యాపిటల్స్ జరిపిన సర్వే ప్రకారం నిఫ్టి 50 కి చెందిన లార్జ్ క్యాప్స్ , NSE కి చెందిన మిడ్ క్యాప్ స్టాక్స్  మార్కెట్ కరెక్షన్ల అనంతరం వేగంగా రికవరీ అయ్యాయని వెల్లడైంది. అంతే కాకుండా కరెక్షన్ సమయంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ ను అనుసరించాయని ఎలారా క్యాపిటల్స్ పేర్కొంది.

 

 Most Popular