ముహూర్తం అదుర్స్- మణప్పురం హైజంప్

ముహూర్తం అదుర్స్- మణప్పురం హైజంప్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో దీపావళి రోజు నిర్వహించిన ముహురత్‌ ట్రేడింగ్‌లో మణప్పురం ఫైనాన్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. పటిష్ట ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. వివరాలు చూద్దాం..
క్యూ2 గుడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో మణప్పురం ఫైనాన్స్‌ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 224 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం 22 శాతం ఎగసింది. రూ. 1027 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి.  దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ఎన్‌ఎస్ఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి ఈ షేరు 5 శాతంపైగా జంప్‌చేసి రూ. 87 వద్ద నిలిచింది.Most Popular