దివాలీ దమాఖా- మార్కెట్లు రయ్‌రయ్‌

దివాలీ దమాఖా- మార్కెట్లు రయ్‌రయ్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొత్త ఏడాది సంవత్‌ 2075 హుషారుగా ప్రారంభమైంది. దివాలీ సందర్భంగా సాయంత్రం గంటపాటు నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌లో లాభాల పటాసులు పేలాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్‌ సెంచరీ చేసింది. చివరికి సెన్సెక్స్ 246 పాయింట్లు ఎగసి 35,238 వద్ద ముగిసింది. వెరసి 35,000 పాయింట్ల మైలురాయికి ఎగువన నిలిచింది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు పెరిగి 10,598 వద్ద స్థిరపడింది. మంగళవారం మధ్యంతర ఎన్నికల నేపథ్యంలోనూ యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు లాభపడటంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

Image result for thumbs up
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధాన ఇండెక్సులన్నీ 1-0.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్ఫ్రాటెల్‌, వేదాంతా, హీరోమోటో, ఐవోసీ, ఏషియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం యాక్సిస్‌ బ్యాంక్‌, జీ అదికూడా 0.3 శాతంస్థాయిలో బలహీనపడ్డాయి. 
ఎఫ్‌అండోవో ఇలా
డెరివేటివ్‌ స్టాక్స్‌లో ఇన్‌ఫీబీమ్‌ 21 శాతం దూసుకెళ్లగా.., మణప్పురం, సౌత్‌ ఇండియన్‌, అపోలో టైర్‌, ఎన్‌బీసీసీ, జేపీ, రెప్కో హోమ్‌, సుజ్లాన్‌, పెట్రోనెట్‌, సీజీ పవర్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరొపక్క వోల్టాస్‌, టాటా కమ్యూనికేషన్స్‌, కంకార్‌, హింద్‌ జింక్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, బాలకృష్ణ, బీఈఎంఎల్‌, సీమెన్స్ 2-0.5 శాతం మధ్య నీరసించాయి.
చిన్న షేర్లు ఓకే
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ నెలకొంది. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1941 లాభపడితే.. కేవలం 429 నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 500 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 119 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు పూర్తిగా సైలెంట్‌ అయిపోగా.. డీఐఐలు మాత్రం రూ. 622 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. Most Popular