సంవత్‌ 2075లో ఈ స్టాక్స్ కొంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఇక వెలుగులే..

సంవత్‌ 2075లో ఈ స్టాక్స్ కొంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఇక వెలుగులే..

గత దివాలీ సంవత్సరమైన సంవత్‌ 2074లో నిఫ్టీ 50 3 శాతం రిటర్న్స్‌ను మాత్రమే ఇచ్చిది. BSE మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు 8 నుండి 15 శాతం పడిపోయాయి. నిఫ్టీ 50 లో కూడా ఇన్ఫోసిస్, TCS, రిలయన్స్ ఇండస్ట్రీస్, ICICI బ్యాంక్ , HDFC బ్యాంక్ ఈ 5 కంపెనీలు మాత్రమే లాభాలను చూపించాయి. మ్యూచువల్ ఫండ్స్ తమ విధానాలను మార్చుకోడం లేదా సవరించుకోడం ద్వారా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రంగాల్లో మారణహోమమే మిగిలింది. అంతగా పడిపోయాయి ఆ స్టాక్స్.
మరి ఇప్పుడున్న మార్కెట్ అనిశ్చితిలో ఏ ఏ స్టాక్స్ ను ఎంచుకోవాలి. రానున్న సంవత్ 2075 లాభాల సంవత్సరంగా ఎలా మార్చుకోవాలి.? ఈ ప్రశ్నలకు ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థల వారు, ఎనలిస్టులు పలు సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ICICI సెక్యూరిటీస్ వారు సూచిస్తున్న స్టాక్స్...
అరబిందో ఫార్మా ( టార్గెట్ ప్రైజ్ : రు. 915 )
గత కొన్ని సంవత్సరాలుగా అరబిందో లిక్విడిటీ, డెబిట్ సినారియోను సమర్ధవంతంగా నడుపుతుంది. కంపెనీ పురోగతి కూడా నిలకడగా ఉంది. అమెరికాలో , యూరోపియన్ మార్కెట్లలో తన ఉత్పత్తుల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. అంతేకాకుండా అమెరికాలో ఈ కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ కూడా ఏర్పడటం సానుకూలాంశం. విదేశీ మారక ద్రవ్య ఆర్జనలో ఈ కంపెనీ 60 శాతం నెట్ మార్జిన్లు కలిగి ఉంది. కంపెనీ వార్షిక వృద్ధి రేటు 23-28 శాతం ఉండొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.
దివీస్ ల్యాబ్  ( టార్గెట్ ప్రైజ్ రు. 1,700 )
ఇప్పుడున్న మార్కెట్ సంక్షోభంలో కూడా దివీస్ ల్యాబ్ తన రెండో త్రైమాసిక ఫలితాలను లాభాల్లో చూపించగలిగింది. చైనీస్ సరఫరా పరిమితుల నేపథ్యంలో అధిక సామర్ధ్యంతో క్యూ-2 ఫలితాలను మెరుగు పరుచుకుంది. అలాగే కంపెనీ క్యాపెక్స్ (మూల ధనం) రు. 1500 కోట్లకు చేరుకోడం కూడా ఆ కంపెనీ స్టాక్స్ పుంజుకోడానికి దోహద పడింది. అందుకే దివీస్ ల్యాబ్స్ స్టాక్ టార్గెట్ ప్రైజ్‌ రు. 1700 గా ఎనలిస్టులు పేర్కొంటున్నారు.
SBI బ్యాంక్ ( టార్గెట్ ప్రైజ్ : రు. 340 )
మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తుల రికవరీలో SBI గట్టి నిర్ణయాలు తీసుకుంటుండటంతో  బ్యాంకు పనితీరుపై అంచనాలు పెరిగాయి. క్రెడిట్ గ్రోత్ పెరగడంతో పాటు.. ఈ రెండో త్రైమాసికంలో లాభాలను చవి చూడటం కూడా SBI పై అంచనాలను పెంచేశాయి. అందుకే స్టాక్ విశ్లేషకులు SBI టార్గెట్ ప్రైజ్ రు. 340 గా పేర్కొంటున్నారు.
యాక్సిస్ బ్యాంక్ ( టార్గెట్ ప్రైజ్ రు. 725 )
2019 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికానికల్లా...బ్యాంకు ఆదాయాలు, నికర ఆస్తుల విలువ రు. 4 లక్షల కోట్లకు చేరనుందని ఎనలిస్టుల అంచనా. కంపెనీ వార్షిక వృద్ధి రేటు దాదాపు 30
శాతం పెరగడం కూడా యాక్సిస్ బ్యాంక్ విషయంలో కనిపిస్తుంది. మిగతా ప్రైవేట్ బ్యాంకుల కంటే ఎక్కువగా శాఖలు, ఏటీఎం అవుట్ లెట్స్‌తో అగ్రపథాన దూసుకెళ్తుంది యాక్సిస్ బ్యాంక్. జూన్ 2018 నాటికి కంపెనీలో డిపాజిట్ల శాతం 47శాతానికి పెరిగింది.  బ్రాండ్ వాల్యూ, క్వాలిటీ సర్వీసెస్ తో యాక్సిస్ బ్యాంక్ మీద అంచనాలు పెంచేలా చేశాయి. స్టాక్ ఎనలిస్టులు బ్యాంక్ టార్గెట్ ప్రైజ్ రు. 725 గా పేర్కొన్నారు.
టైటాన్ కంపెనీ ( టార్గెట్ ప్రైజ్ : రు. 950 )
మార్కెట్ల పతనం జరుగుతున్నా.. నిలకడైన పనితీరుతో ఈ ఆర్ధిక సంవత్సరంలో టైటాన్ కంపెనీ షేర్లు వేగంగా  పుంజుకున్నాయి. ఆభరణాలు, జ్యూయల్రీ రంగంలో కంపెనీ తన విధానాలను ఆధునీకరించుకోడంతో గణనీయ పురోభివృద్ధిని సాధించింది.  వార్షిక వృద్ధి రేటు  20 శాతం చొప్పున  ఉండటంతో కంపెనీ మీద అంచనాలు పెరిగాయి. రానున్న ఆర్ధిక సంవత్సరంలో ఈ వార్షిక వృద్ధి రేటు 33 శాతం దాకా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అందుకే స్టాక్ ఎనలిస్టులు టైటాన్ స్టాక్స్ టార్గెట్ ప్రైజ్ రు. 950 గా పేర్కొంటున్నారు.
ట్రెంట్ ఫ్యాషన్
ఫ్యాషన్స్ బిజినెస్‌లో ట్రెంట్ తన బ్రాండ్ అయిన జుడియో ద్వారా అత్యధిక లాభాలను ఆర్జించింది. అంతే కాకుండా ట్రెంట్ తన నూతన విధానాలతో ఫ్యాషన్ రంగంలో కొత్త విస్తరణలకు పూనుకుంది. రానున్న సంవత్సరంలో వార్షిక వృద్ధి రేటు 25 శాతం ఉండొచ్చని ఎనలిస్టుల అంచనా. EBITDA  మార్జిన్లు కూడా దాదాపు 120 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రెంట్ యొక్క స్వతంత్ర బ్రాండ్లైన ఇండిటెక్స్, జారా, స్టార్ బజార్ వంటి వాటి వ్యాపార పురోభివృద్ధి కూడా గణనీయంగా మెరుగు పడింది. అందుకే స్టాక్ ఎనలిస్టులు ట్రెంట్ టార్గెట్ ప్రైజ్‌గా రు. 410 గా నిర్ణయించారు.
EIH  ( టార్గెట్ ప్రైస్ : రు. 205 )
దేశ, విదేశాల్లో ఏకంగా 4,834 రూమ్స్ కలిగిన ఈస్ట్ ఇండియా హోటెల్స్ (EIH ) తన వ్యాపార విస్తరణను వేగవంతం చేసింది. హోటల్స్ రంగంలో అత్యధిక వ్యాపారం కలిగిన హోటెల్‌ గా EIH నిలిచింది. వార్షిక వృద్ధి రేటు  20శాతంగా ఉన్న ఈ కంపెనీ స్టాక్స్ టార్గెట్ ప్రైజ్‌ రు. 205 గా పేర్కొన్నారు.

ఎడల్వీస్ సెక్యూరిటీస్ సూచిస్తున్న స్టాక్స్
బయోకాన్
డాబర్ ఇండియా
HDFC బ్యాంక్
హావెల్స్ ఇండియా
సన్ ఫార్మా
వోల్టాస్

మోతీలాల్ ఓస్వాల్ సూచిస్తున్న కంపెనీలు
మారుతీ సుజుకీ          ( టార్గెట్ ప్రైజ్ : రు. 8,484 )
హిందాల్కో ఇండస్ట్రీస్      ( టార్గెట్ ప్రైజ్: రు.338)
LIC హౌజింగ్ ఫైనాన్స్ LICHF      ( టార్గెట్ ప్రైజ్ : రు. 550)
PVR                 ( టార్గెట్ ప్రైజ్ : రు. 1,650 )
ఒబెరాయ్ రియాల్టీ          ( టార్గెట్ ప్రైజ్ : రు. 574)
ఇన్ఫోసిస్            ( టార్గెట్ ప్రైజ్ ; రు. 800 )
ఇంద్రప్రస్థ గ్యాస్  :         ( టార్గెట్ ప్రైజ్‌ : రు. 373)
ICICI బ్యాంక్ :          ( టార్గెట్ ప్రైజ్ : రు. 400)
బ్రిటానియా ఇండస్ట్రీస్ :      ( టార్గెట్ ప్రైజ్ : రు. 6,870 )
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ :        ( టార్గెట్ ప్రైజ్ : రు. 314 )
........

సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ సూచిస్తున్న స్టాక్స్
CARE రేటింగ్స్
సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) CDSL
HDFC స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ
జాగరణ్ ప్రకాశన్
నెస్ట్‌లీ ఇండియా
పేజ్ ఇండస్ట్రీస్
పిడిలైట్ ఇండస్ట్రీస్
RBL బ్యాంక్
సింఫనీ
Zee ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్

..............

ఆనంద్ రాఠీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచిస్తున్న స్టాక్స్ ..
ఏషియన్ పేయింట్స్
HDFC బ్యాంక్
L&T టెక్నాలజీస్
JSW స్టీల్స్ లిమిటెడ్
సుందరం ఫాస్టనర్స్ లిమిటెడ్
ఇంద్రప్రస్థ గ్యాస్

............

IIFL సూచిస్తున్న కంపెనీలు..
ఆర్తీ ఇండస్ట్రీస్     :  టార్గెట్ ప్రైజ్ : రు. 1,517
మైండ్ ట్రీ            :  టార్గెట్ ప్రైజ్ : రు. 1,081
ఎంఫసిస్            :  టార్గెట్ ప్రైజ్ : రు. 1,328
మదర్‌సన్ సుమీ     :  టార్గెట్ ప్రైజ్ : రు.    293
పెట్రో నెట్ LNG     :  టార్గెట్ ప్రైజ్ : రు.    256
రిలయన్స్ ఇండస్ట్రీస్ :  టార్గెట్ ప్రైజ్‌ : రు.  1,310

 


 Most Popular