జెట్‌ ఎయిర్‌ -పీఎన్‌బీ హౌసింగ్‌ జూమ్‌

జెట్‌ ఎయిర్‌ -పీఎన్‌బీ హౌసింగ్‌ జూమ్‌

ప్రయివేట్‌ రంగ కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్న వార్తలు విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌కు రెక్కలిచ్చాయి.  మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. వివరాలు చూద్దాం...

జెట్‌ ఎయిర్‌వేస్‌
ఆర్థిక సమస్యలతో కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌లో 51 శాతం వాటా కొనుగోలుకి టాటా గ్రూప్‌ చర్చలు నిర్వహిస్తున్నట్లు వెలువడ్డ వార్తలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 261 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 269 వద్ద గరిష్టాన్నీ, రూ. 242 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది.
ఇతర వివరాలు ఇలా
నరేష్‌ గోయల్‌ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌ చర్చలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. దీంతో సోమవారం సైతం ఈ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్‌ వాటాతోపాటు.. లాయల్టీ ప్రోగ్రామ్‌లో సైతం టాటా గ్రూప్‌ మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నట్లు మార్కెట్లో వినిపిస్తోంది. కాగా.. ఈ నెల 12న నిర్వహించనున్న సమావేశంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది.

Image result for PNB Housing

పీఎన్‌బీ హౌసింగ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం 33 శాతం జంప్‌చేసి రూ. 253 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం 42 శాతం ఎగసింది. రూ. 1808 కోట్లయ్యింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. ఈ బాటలో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 25 శాతం పుంజుకుని రూ. 463 కోట్లకు చేరగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.34 శాతం నుంచి 0.45 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.27 శాతం నుంచి 0.35 శాతానికి స్వల్పంగా పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2.6 శాతం లాభపడి రూ. 902 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 927 వద్ద గరిష్టాన్నీ, రూ. 882 వద్ద కనిష్టాన్నీ తాకింది.Most Popular