మార్కెట్ల వెనకడుగు-యూరప్‌ వీక్‌! 

మార్కెట్ల వెనకడుగు-యూరప్‌ వీక్‌! 

ఉన్నట్టుండి మిడ్‌సెషన్‌లో కొనుగోళ్లు మందగించడంతోపాటు అమ్మకాలకు తెరలేవడంతో మార్కెట్లు తొలుత ఆర్జించిన లాభాలు పోగొట్టుకున్నాయి. స్వల్ప వెనకడుగు వేశాయి. మరోపక్క సానుకూలంగా ప్రారంభమైన యూరోపియన్‌ మార్కెట్లు సైతం స్వల్ప నష్టాలలోకి ప్రవేశించాయి. దీంతో కొంతమేర సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 16 పాయింట్ల లాభానికి దిగివచ్చి 34,968ను తాకింది. వెరసి 35,000 పాయింట్ల మార్క్‌ను కోల్పోయింది. నిఫ్టీ మాత్రం 5 పాయింట్లు క్షీణించి 10,529 వద్ద ట్రేడవుతోంది.  

ఐటీ దన్ను
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 0.6 శాతం పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.25 శాతం తిరోగమించింది. ఎఫ్‌ఎంసీజీ దాదాపు 1 శాతం బలహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, జీ, యస్‌బ్యాంక్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, వేదాంతా, గెయిల్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, ఆర్‌ఐఎల్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే సిప్లా దాదాపు 6 శాతం పతనంకాగా..  హెచ్‌పీసీఎల్‌, ఎస్‌బీఐ, యాక్సిస్, బీపీసీఎల్‌, ఐవోసీ, టైటన్‌, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌, మారుతీ 3-1 శాతం మధ్య క్షీణించాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఇన్ఫీబీమ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, గ్లెన్‌మార్క్‌, టొరంట్‌ ఫార్మా, దివాన్‌ హౌసింగ్‌, ఎంఆర్‌పీఎల్‌, టాటా కెమ్‌ 5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పీసీ జ్యువెలర్స్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 12 శాతం చొప్పున కుప్పకూలగా.. సిప్లా, ఎన్‌ఎండీసీ, ఐఆర్‌బీ, జేపీ, మ్యాక్స్‌ ఫైనాన్స్, ఐజీఎల్‌, సుజ్లాన్‌ 6-3 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు డౌన్
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ డీలాపడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ 0.6 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1272 నష్టపోగా... 1207 లాభాలతో ట్రేడవుతున్నాయి. Most Popular