రియల్టీ, ఐటీ జోష్‌- ఎఫ్‌ఎంసీజీ డీలా 

రియల్టీ, ఐటీ జోష్‌- ఎఫ్‌ఎంసీజీ డీలా 

దివాలీ ముహూర్తం ముందున్న నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు పటిష్టంగా కదులుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల సెంచరీ సాధించిన సెన్సెక్స్ డబుల్‌పై కన్నేసింది. ప్రస్తుతం 184 పాయింట్లు పెరిగి 35,135ను తాకింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు ఎగసి 10,570 వద్ద ట్రేడవుతోంది. సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పుంజుకోవడంకూడా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ప్రభుత్వ బ్యాంక్స్‌ డల్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1-0.5 శాతం మధ్య  లాభపడగా... పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.6 శాతం చొప్పున తిరోగమించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 4 శాతం జంప్‌చేయగా.. యస్‌బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ, టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌, ఓఎన్‌జీసీ, జీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే సిప్లా దాదాపు 6 శాతం పతనంకాగా.. యాక్సిస్, ఐవోసీ, ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, హిందాల్కో, అల్ట్రాటెక్‌, ఐటీసీ 3-0.65 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

Image result for stock investors

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఇన్ఫీబీమ్‌, గ్లెన్‌మార్క్‌, టొరంట్‌ ఫార్మా, దివాన్‌ హౌసింగ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎంఆర్‌పీఎల్‌, కేన్‌ఫిన్‌ 5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బాలకృష్ణ ఇండస్ట్రీస్ 11 శాతం కుప్పకూలగా.. పీసీ జ్యువెలర్స్‌, ఎన్‌ఎండీసీ, ఈక్విటాస్‌, ఐజీఎల్‌, అపోలో హాస్పిటల్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ 5.6-2.4 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు అప్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ పుంజుకున్నాయి. బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1340 లాభపడగా... 966 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. రియల్టీ షేర్లలో ఫినిక్స్‌, ఇండియాబుల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఒబెరాయ్‌ 3.7-1.2 శాతం మధ్య పుంజుకున్నాయి.Most Popular