దివాలీ- పెట్టుబడుల ముహూర్తం..ఇలా!

దివాలీ- పెట్టుబడుల ముహూర్తం..ఇలా!

లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు నరక చతుర్ధశి. అదే దీపావళి. మరి ఆ రోజు ముహరత్ ట్రేడింగ్ చేస్తే కలిసి వస్తుందని దేశ వ్యాప్తంగా మదుపర్ల నమ్మకం. ఎలాంటి పోర్ట్ ఫోలియోను నిర్మించుకోవాలి. ఏ ఏ స్టాక్స్‌లో ఎంతెంత పెట్టుబడులు పెట్టాలి. అసలు మన వద్ద ఉన్న నగదును ఎలా పెట్టుబడుల్లో విభజించాలి. ఈ ప్రశ్నలకు దివాలీ మూరత్ సందర్భంగా ప్రముఖ స్టాక్ ఎనలిస్టులు పలు విలువైన సలహాలు , సూచనలు ఇస్తున్నారు. మరి మీరు ఫాలో అవ్వండి.
ఎంత పెట్టుబడి పెడదామనుకున్నారు?
ప్రస్తుతం దేశీయ మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్లు కరెక్షన్లకు గురౌతూనే ఉన్నాయి.  మార్కెట్లలోని అనిశ్చితి మదుపర్ల సంపదను ఆవిరయ్యేలా చేస్తుంది. ఈ 2018 సంవత్సరం మొత్తం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలకు తీరని దెబ్బ కొట్టింది. ఇండెక్స్ సూచీలు నేల చూపులు చూస్తుండిపోయాయి. మరి ఇలాంటి సమయంలోనే మదుపర్లు తమ పోర్ట్ ఫోలియోలను రీ షఫుల్ చేసుకోవాల్సిన తరుణం. పడిపోయిన షేర్లలోంచి మంచి వాటిని ఎంచుకోడంలోనే దాగున్న లాభాలను వెలికి తీయడం సాధ్యమౌతుందని స్టాక్ విశ్లేషకులు అంటున్నారు. ఒక ఇన్వెస్టర్‌కు నెలకు లక్ష రూపాయిల రాబడి ఉందనుకుందాం. అందులో కుటుంబ పోషణ, ఖర్చుల నిమిత్తం 40,000 పోగా మిగిలిన మొత్తంలో ఎంతెంత వేటి వేటిలో ఇన్వెస్ట్ చేయాలో ప్రముఖ స్టాక్ నిపుణులు, LIC మ్యూచువల్ ఫండ్ మేనేజర్ లవ్ కుమార్ ఇలా చెబుతున్నారు.
ఇన్ కం :                  రు.1,00,000
కుటుంబ ఖర్చులు:     రు.  40,000
         ____________________
మిగులు :                 రు.  60,000
        _____________________

ఈ మిగులు రు. 60,000 లోంచి ...
ఈక్విటీస్ ఇన్వెస్ట్ మెంట్:         రు.35,000
రుణ పెట్టుబడులు:                 రు.20,000
బంగారం మీద పెట్టుడులు:       రు.  5,000

అయితే ఇలా పెట్టుబడులు ఈ దీపావళి నుండి వచ్చే దీపావళి వరకూ ఇన్వెస్ట్ చేయగలి ఉంటే ఇది ఒక్క 12 నెలల కాలంలోనే గణనీయ లాభాలను తీసుకొస్తుందని ప్రసన్న పాఠక్ అంటున్నారు.
ఇలా పెట్టుబడులు పెట్టాలంటే.. ఓ 6 నెలల కాలం సరిపడే అకస్మిక నిధి కింద రు. 2.4 లక్షలను సైడ్‌ బై చేసుకుని ఉండాలి. (అంటే ఈ అకస్మిక నిథి ఇతర అత్యవసర పరిస్థితుల కోసం వినియోగించుకోవచ్చని విశ్లేషకుల భావన )
లార్జ్ క్యాప్ రంగంలో పెట్టుబడులు మంచి రిటర్న్స్ నే ఇస్తాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాల్లో కొన్ని మంచి కంపెనీలను సెలక్ట్ చేసుకుని ఆయా కంపెనీల బుక్ వాల్యూమ్‌ ను పరిశీలించి స్టాక్‌ను ఎంపిక చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ 2019 ఆర్ధిక సంవత్సరంలో సెన్సెక్స్ టార్గెట్‌ 45,000 పాయింట్లుగా ఉందని , పోర్ట్ ఫోలియో స్ట్రాటజీలో ఈక్విటీస్ 40 శాతం, రుణ పెట్టుబడులు 30శాతం, గోల్డ్‌ మీద 20శాతం పెట్టుబడలు పెడితే మంచిదని కార్వే స్టాక్ బ్రోకింగ్ హెడ్ ఆఫ్ ది ఫండమెంటల్ , వివేక్ రంజన్ సూచిస్తున్నారు.


మన జీవన స్థాయిని బట్టే మన ఫోర్ట్ ఫోలియో...
మన స్టాక్స్ పోర్ట్ ఫోలియో మన ఆదాయ తరగతికి అనుగుణంగా ఉండాలని టారస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ప్రసన్న పాఠక్ అంటున్నారు. మన జీవన శైలి, ఆదాయ మార్గాలు, ఖర్చులు వీటికి అనుగుణంగానే మన స్టాక్ పోర్ట్ ఫోలియో ఉండాలని ప్రసన్న సూచిస్తున్నారు. మీ వద్ద నున్న మిగులు మొత్తంలోంచి  50-60 శాతం ఈక్విటీస్‌లో పెట్టుబడులుగా పెట్టాలి. (డైవర్సిఫైడ్ ఈక్విటి మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్)  అలాగే ఫిక్స్‌డ్ ఇన్‌కం 20-30శాతం గా,(డైవర్సిఫైడ్ ఫిక్స్‌డ్ ఇన్‌కం MF, FD,ఆర్బిట్రేజ్ ఫండ్స్ ) ,  క్యాష్, రుణ పెట్టుడులు 10-20 శాతం గా (సేవింగ్స్ బ్యాంక్‌లో నిల్వలు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ), ఉండాలని ప్రసన్న పేర్కొన్నారు.


దీర్ఘకాలిక లక్ష్యాలే మంచివి
మీ పెట్టుబడుల మీద ఎప్పుడూ దీర్ఘకాలిక లాభాలను అంచనా వేసుకునే స్టాక్స్ పిక్ చేసుకోమని సూచిస్తున్నారు ల్యాడర్‌ అప్‌ వెల్త్ మేనేజ్ మెంట్ MD రాఘవేంద్ర నాథ్. కనీసం 7 నుండి 10 సంవత్సరాల దీర్ఘకాలిక పెట్టుబడులే మంచి లాభాలను ఇస్తాయని రాఘవేంద్ర అంటున్నారు. మీ వయసు 35-40 సంవత్సరాల మధ్య ఉంటే .. దీర్ఘకాలిక వ్యూహాలతో 60-70 శాతం పెట్టబడులను ఈక్విటీస్ మీద పెట్టమని సూచిస్తున్నారు. మిగతా 10-30 శాతం రుణ, ఫిక్స్‌డ్ , గోల్డ్ వంటి వాటి మీద పెట్టమని సూచిస్తున్నారు. కనీసం 7 సంవత్సరాల కాలం అనేది  ఈక్విటీస్ నుండి మంచి లాభాలు పిండుకునే సమయమని ల్యాడర్‌ వెల్త్ మేనేజ్ మెంట్ భావిస్తుంది.

Disclaimer: ఈ వ్యాసంలో  పొందు పరిచిన సూచనలు , సలహాలు కేవలం విశ్లేషకుల నుండి తీసుకున్నవి మాత్రమే. వీటి ఫలితాలపై ప్రాఫిట్ యువర్ ట్రేడ్‌కు ఎలాంటి సంబంధం లేదని మనవి.

 

 Most Popular