ఆంధ్రా బ్యాంక్‌, దివాన్‌ హౌసింగ్‌ గెయిన్‌

ఆంధ్రా బ్యాంక్‌, దివాన్‌ హౌసింగ్‌ గెయిన్‌

భాగస్వామ్య సంస్థలలో తమకున్న వాటాలను విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించడంతో ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రా బ్యాంక్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. మరోవైపు బాండ్ల చెల్లింపులను పూర్తి చేసినట్లు పేర్కొనడంతో దివాన్‌ హౌసింగ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. వివరాలు ఇవీ...

ఆంధ్రా బ్యాంక్‌
వివిధ భాగస్వామ్య సంస్థల(జేవీలు)లో ఉన్న వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించనున్నట్లు ఆంధ్రా బ్యాంక్‌ తాజాగా తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 5.25 శాతం జంప్‌చేసి రూ. 30 ఎగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 31ను సైతం అధిగమించింది. ఏఎస్‌ఆర్‌ఈసీ లిమిటెడ్‌, ఇండియా ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌(మలేసియా) బీహెచ్‌డీ, ఇండియా ఫస్ట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్ తదితరాలలో వాటాలను విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది.

Image result for dewan housing finance

దివాన్‌ హౌసింగ్‌
సెప్టెంబర్‌ 21 మొదలు రూ. 9465 కోట్లమేర కమర్షియల్‌ పేపర్స్‌(బాండ్లు) చెల్లింపులను పూర్తిచేసినట్లు దివాన్‌ హౌసింగ్‌ స్పష్టం చేసింది. వీటిలో రూ. 3240 కోట్ల విలువైన సీపీల బైబ్యాక్‌ సైతం ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా నవంబర్‌ 15కల్లా గడువు పూర్తయ్యే సీపీల చెల్లింపులను పూర్తిచేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో దివాన్‌ హౌసింగ్‌ షేరు బలాన్ని పుంజుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం ఎగసి రూ. 228 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 235-224 మధ్య ఊగిసలాడింది.Most Popular