బాలకృష్ణ ఇండస్ట్రీస్‌కు గైడెన్స్‌ షాక్‌

బాలకృష్ణ ఇండస్ట్రీస్‌కు గైడెన్స్‌ షాక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర గైడెన్స్‌ ప్రకటించడంతో ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 9 శాతం కుప్పకూలింది. రూ. 973 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1041 వద్ద గరిష్టాన్నీ.. రూ. 967 వద్ద కనిష్టాన్నీ తాకింది. 

Image result for balkrishna industries

ఫలితాలు ఓకే
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 222 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 1325 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 9 శాతం బలపడి రూ. 333 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 27.4 శాతం నుంచి 25.1 శాతానికి బలహీనపడ్డాయి. ఇతర వ్యయాలు సైతం రూ. 202 కోట్ల నుంచి రూ. 313 కోట్లకు పెరిగాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి టైర్ల అమ్మకాల అంచనాల(గైడెన్స్‌)లో కంపెనీ కోతపెట్టింది. 2.25-2.3 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి టైర్ల అమ్మకాల అంచనాలను 2.1-2.2 లక్షల ఎంటీకి కుదించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు ఎగబడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  
 Most Popular