లాభాల్లో మార్కెట్లు- చిన్న షేర్లు అప్‌

లాభాల్లో మార్కెట్లు- చిన్న షేర్లు అప్‌

దీపావళి పండుగ ముందురోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆశావహంగా కదులుతున్నాయి. సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్న నేపథ్యంలో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్‌ సెంచరీ చేసింది. దీంతో సెన్సెక్స్‌ 35,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. ప్రస్తుతం 149 పాయింట్లు పెరిగి 35,099ను తాకింది. నిఫ్టీ సైతం 42 పాయింట్లు ఎగసి 10,566 వద్ద ట్రేడవుతోంది. 

టాటా మోటార్స్‌ ప్లస్‌లో

సెన్సెక్స్‌ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 4.5 శాతం జంప్‌చేసింది. జేఎల్‌ఆర్ అమ్మకాలు అక్టోబర్‌లో పుంజుకోవడం ఇందుకు సహకరించగా.. టీసీఎస్‌, వేదాంతా, అదానీ పోర్ట్స్‌, ఆర్‌ఐఎల్‌, యస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, విప్రో 4- 0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, హీరోమోటో, ఎన్‌టీపీసీ 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

Image result for small pets

చిన్న షేర్లు అప్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 856 లాభపడగా... 313 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో షాలిమార్‌ పెయింట్స్‌, 8కే మైల్స్‌, ఒలెక్ట్రా, ట్రైజిన్‌, దేనా బ్యాంక్‌, ఓరికాన్, జైకార్ప్, వాల్‌చంద్‌నగర్‌, ఐటీడీసీ, ఓరియంట్‌ అబ్రాసివ్స్‌, హైటెక్‌ గేర్‌, ఆర్‌ఐఐఎల్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌, దీప్‌ ఇండస్ట్రీస్‌, కిర్లోస్కర్ ఫెరైట్స్‌ తదితరాలు 14-6 శాతం మధ్య జంప్‌చేశాయి.  కాగా.. మరోవైపు షీలా ఫోమ్‌, ఉషా మార్టిన్‌, వీమార్ట్‌, ఆషాపురా, పీసీ జ్యువెలర్స్‌, బాంబే డయింగ్‌, ఆర్‌పీజీ లైప్‌, శివమ్‌ ఆటో, గణేశ్‌ బెంజో, టీవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు 7-3 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular