టాటా మోటార్స్‌ జూమ్‌- సిప్లా పతనం

టాటా మోటార్స్‌ జూమ్‌- సిప్లా పతనం

అక్టోబర్‌ నెలలో విలాసవంత కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమ్మకాలు పుంజుకోవడంతో టాటా మోటార్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ ఏడాది(2018-19) రెండో క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో దేశీ ఫార్మా దిగ్గజం సిప్లా కౌంటర్‌ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం...

టాటా మోటార్స్‌
అక్టోబర్‌లో జేఎల్‌ఆర్ వాహన విక్రయాలు జంప్‌చేసినట్లు వెల్లడించడంతో దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 197 వద్ద ట్రేడవుతోంది. అక్టోబర్‌లో జాగ్వార్‌ లేండ్‌రోవర్‌ అమ్మకాలు 5270 యూనిట్ల నుంచి 6942 యూనిట్లకు ఎగసినట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. ఇది 32 శాతం వృద్ధికాగా.. జాగ్వార్‌ వాహన అమ్మకాలు 82 శాతం ఎగసి 3324 యూనిట్లను తాకినట్లు తెలియజేసింది.

Image result for Cipla ltd

సిప్లా లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతోపాటు... విదేశీ రీసెర్చ్‌ సంస్థలు షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో సిప్లా లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 4.3 శాతం పతనమై రూ. 540 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 535 వరకూ జారింది. క్యూ2లో సిప్లా నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 377 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం స్వల్ప వెనకడుగుతో రూ. 4012 కోట్లను తాకింది. ఇబిటా 13 శాతం నీరసించి రూ. 702 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 19.7 శాతం నుంచి 17.5 శాతానికి బలహీనపడ్డాయి. విదేశీ బ్రోకింగ్‌ సంస్థలు మెక్వారీ, హెచ్‌ఎస్‌బీసీ, క్రెడిట్‌ స్వీస్‌, సిటీ తదితరాలు షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌(న్యూట్రల్‌, అండర్‌వెయిట్‌, హోల్డ్ ) చేయడంతోపాటు టార్గెట్‌ ధరలను తగ్గించాయి.Most Popular