సెంచరీతో షురూ- పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌

సెంచరీతో షురూ- పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌

సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పుంజుకోవడం, దీపావళి పండుగ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్‌ సెంచరీ చేసింది. దీంతో సెన్సెక్స్‌ 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 160 పాయింట్లు పెరిగి 35,110ను తాకింది. నిఫ్టీ సైతం 50 పాయింట్లు ఎగసి 10,574 వద్ద ట్రేడవుతోంది. 

Image result for HIndalco

వేదాంతా హైజంప్‌
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, ఆటో, రియల్టీ, ఐటీ రంగాలు 1-0.7 శాతం మధ్య  లాభపడగా... పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.7 శాతం తిరోగమించింది, ఫార్మా స్వల్ప వెనకడుగులో ఉంది. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా దాదాపు 9 శాతం దూసుకెళ్లగా.. సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. అయితే బజాజ్‌ ఫిన్‌, అల్ట్రాటెక్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎంఅండ్ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఇండియన్‌ బ్యాంక్‌, ఇన్ఫీబీమ్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, మెక్‌డొవెల్‌, గ్రాన్యూల్స్‌, అరవింద్‌, జేపీ, గాడ్‌ఫ్రే ఫిలిప్‌, సీఈఎస్‌సీ 2-0.7 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు పేజ్‌ ఇండస్ట్రీస్‌, అదానీ ఎంటర్‌, సుజ్లాన్‌, కావేరీ సీడ్‌, బీఈఎంఎల్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ 1-0.6 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు అప్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 856 లాభపడగా... 313 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular