సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌! 

సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 10,588 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. సోమవారం స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. మరోవైపు అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. బుధవారం దీపావళి పండుగ నేపథ్యంలో ట్రేడర్లు కొత్త పొజిషన్లు తీసుకునేందుకు ఆసక్తిచూపుతారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.   

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,481 పాయింట్ల వద్ద, తదుపరి 10,438 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,600 పాయింట్ల వద్ద, తదుపరి 10,700 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 25582, 25431 వద్ద మద్దతు లభించవచ్చని, 25835, 25934 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పూర్తిగా సైలెంట్‌ అయిపోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మాత్రం రూ. 622 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. 

 Most Popular