స్వల్ప నష్టాలతో క్లోజింగ్ బెల్

స్వల్ప నష్టాలతో క్లోజింగ్ బెల్

సోమవారం నాటి మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై ఫ్లాట్‌గానే ముగిసాయి. మిశ్రమ ఫలితాలు, హౌజింగ్ ఫైనాన్స్ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిళ్లు జరిగాయి. BSE సెన్సెక్స్ 60.73 పాయింట్లు నష్టపోయి 34950.92 వద్ద నిలిచింది. ఇక  నిఫ్టీ 29.00 పాయింట్లు నష్టపోయి 10524 వద్ద నిలిచింది.  . తొలుత ఉదయం మార్కెట్లలో ఆయిల్ కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నష్టపోడంతో సెన్సెక్స్ 125 పాయింట్లను కోల్పోయింది.   ONCG, గెయిల్, బాష్ , సిప్లా వంటి కంపెనీలు తమ జులై - సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించాయి. వీటిలో ONGC , సిప్లా వంటి షేర్ల ధరలు కొద్దిగా పుంజుకోగా, బాష్, గెయిల్ వంటి కంపెనీల పనితీరుపై మదుపర్లు నిరాశనే వ్యక్తం చేశారు. దాంతో వీటి షేర్లు 0.6 నుండి 0.12 శాతం వరకూ నష్టపోయాయి. నేటి ఉదయం సెన్సెక్స్ వంద పాయింట్ల నష్టంతో ఆరంభించగా.. మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ షేర్లు డీలా పడ్డాయి. ఇక NBFCలకు బ్యాంకు రుణాలపై ఆర్బీఐ సానుకూలంగా మాట్లాడటంతో ఆయా స్టాక్స్ పుంజుకుంటాయని ఆశించినా.. అంతగా ఫలితం లేక పోయింది. ఇక హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నగదు లభ్యత కొరత ఉందన్న వార్తలు ఆ కంపెనీల స్టాక్స్ ను కుదేలు చేశాయి. దివాన్ హౌజింగ్, ఇండియా బుల్స్ వంటి స్టాక్స్ 13 నుండి 17 శాతం నష్టపోయాయి. లిక్విడిటీ ఉంది అని కంపెనీలు ప్రకటనలు ఇచ్చినా మదుపర్లు వాటిని నమ్మలేదు. దాంతో హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల కౌంటర్లు అమ్మకాల ఒత్తిళ్లు ఎదుర్కొన్నాయి.  SBI  క్వార్టర్‌-2 ఫలితాలు రావడం , NPAలను అమ్మకానికి పెట్టడం వంటి చర్యలతో ఆ కంపెనీ షేర్లు లాభాల బాటలో పయనించాయి. అలాగే గెయిల్ ఇండియా గత ఆర్ధిక సంవత్సరం క్వార్టర్‌ కంటే ఈ సారి మెరుగైన ఫలితాలనే కనబరిచింది. సిప్లా తన రెండో క్వార్టర్ ఫలితాలలో లాభాల్లో క్షీణతను నమోదు చేసింది. ఫార్మా రంగాల్లో షేర్లు మిశ్రమ ఫలితాలనివ్వగా రూపీ కాస్త బలపడటంతో IT షేర్లు ఒత్తడికి లోనయ్యాయి.  మార్కెట్లలో యూకో బ్యాంక్  షేర్లు అత్యధికంగా 14.36శాతం  పెరగగా, జెట్ ఎయిర్ వేస్, మేఘమణి ఆర్గానిక్స్, PC జ్యుయల్రీస్, NBCC ఇండియా లిమిటెడ్ స్టాక్స్ 9 నుండి 6 శాతం పుంజుకున్నాయి. ఇక వెంకీ ఇండియా లిమిటెడ్ అత్యధికంగా -13.26 శాతం నష్టపోగా, సిప్లా, సన్ టీవీ, ఎండ్యూరెన్స్ టెక్, బలరాం పూర్ చిన్ని మిల్స్ , ఇండియన్ ఆయిల్ కార్ప్  వంటి షేర్లు -7.25 శాతం నుండి -5.25 శాతం దాకా నష్టపోయాయి. రూపీ డాలర్‌తో మారకపు విలువ రు. 74 నుండి 73.30 వరకూ దిగిరావడంతో మార్కెట్లు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. SBI రెండో క్వార్టర్ ఫలితాలలో నెట్ ప్రాఫిట్  రు. 944.9 కోట్లుగా నమోదు చేసింది. టాక్స్ ఎక్స్‌పెన్స్ రు. 868 కోట్లుగా ఉంది. లాభాల్లో క్షీణత ఉన్నప్పటికీ SBI షేర్లు  కాస్త పుంజుకున్నాయి.  క్రెడిట్ గ్రోత్ 11.7శాతంగా ఉందని బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు నిరర్ధక ఆస్తులను చాలా వరకూ తగ్గించుకునే యత్నాలు మొదలెట్టామని SBI  పేర్కొంది.
 Most Popular