క్యూ2లో స్వల్ప లాభాలను చవి చూసిన బాష్‌

క్యూ2లో స్వల్ప లాభాలను చవి చూసిన బాష్‌

బెంగుళూరుకు చెందిన ఆటో పార్ట్స్ , మెషినరీ తయారీ సంస్థ బాష్ (BOSCH ) ఈ 2018  సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడి చేసింది.  కంపెనీ నెట్ ప్రాఫిట్ 19శాతం పెరిగి రు.420 కోట్లు కాగా, గత సంవత్సరం ఇదే నెట్ ప్రాఫిట్ రు. 353 కోట్లుగా ఉంది. రెవిన్యూ కూడా 14శాతం పెరిగి రు. 3,201 కోట్లుగా నమోదు అయింది. గత సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రెవిన్యూ రు. 2,811.85గా ఉంది. కాగా బాష్ కంపెనీ దాదాపు  ఒక్కో షేర్‌కు రు. 21,000 చోప్పున 10 లక్షల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా నేటి సోమవారం మార్కెట్లో బాష్ షేర్ వాల్యూ రు. 19,429.60 వద్ద ట్రేడ్ అవుతోంది.
 Most Popular