దేశీయ రిటైల్ రంగంలోకి అమెజాన్ పెట్టుబడులు..??

దేశీయ రిటైల్ రంగంలోకి అమెజాన్ పెట్టుబడులు..??

దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటుంది. అందులో భాగంగా దేశంలోని పలు చైన్ సూపర్ మార్కెట్ల కంపెనీల్లో వేల కోట్లు కుమ్మరించడానికి సిద్ధం అవుతోంది. దేశీయంగా పలు రిటైల్ అవుట్ లెట్లు కలిగిన బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లలో 9.5శాతం వాటాలను కొనుగోలుకు అమెజాన్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ డీల్‌ మొత్తం విలువ రు. 2,500 కోట్లుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  ఫ్యూచర్స్ రిటైల్ సంస్థకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 స్టోర్లు ఉన్నాయి. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్‌ (FPI) గా అమెజాన్ ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనుంది. దీనికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా రెడీ అయ్యాయని, బోర్డ్ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్ రిటైల్స్ వర్గాలు తెలిపాయి. ఈ నవంబర్ 14 నాటికి ఈ డీల్ సాకారం కానున్నట్టు కంపెనీ పేర్కొంది. కాగా ఫ్యూచర్స్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీ గత కొద్ది నెలలుగా అమెజాన్ CEO, ఫౌండర్ జెఫ్ బెజోస్‌తో తరుచుగా భేటీ అవుతున్నారు. దాంతో ఈ పెట్టుబడుల విషయం నిజమే అంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. మన దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. అదీ FPI గా రిజిస్టర్డ్ చేసుకుని ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. గతంలో కూడా అమెజాన్ షాపర్స్ స్టాప్‌లో 5శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇదే కాకుండా అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ లో కూడా విట్‌ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులను పెట్టింది.

source : Economic Times
5 లక్షల కోట్ల పెట్టుబడులకు అమెజాన్ సిద్ధం
అంతే కాకుండా అమెజాన్ భారత దేశంలో సుమారు రు.5 లక్షల కోట్లను పెట్టుబడులుగా పెట్టాలని భావిస్తుంది. 500 మిలియన్ డాలర్లతో దేశీయంగా ఫుడ్ , ప్రాసెసింగ్ విభాగాల్లోకి రానున్నట్టు అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ఇన్నోవేటివ్స్ పేరిట త్వరలోనే తన కార్యకలాపాలను ప్రారంభిచనున్నట్టు సమాచారం.
 Most Popular