క్యూ-2లో మెరుగైన శ్రీరామ్ పిస్టన్స్ ఫలితాలు

క్యూ-2లో మెరుగైన శ్రీరామ్ పిస్టన్స్ ఫలితాలు

ఈ సెప్టెంబర్ రెండో త్రైమాసిక ఫలితాలను శ్రీరామ్ పిస్టన్స్&రింగ్స్ వెల్లడించింది. గత సంవత్సరం కంటే ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ఫలితాలను కనబరిచింది .మొత్తం నెట్ విక్రయాలు రు. 493.23 కోట్లుగా, గత 2017 సెప్టెంబర్ క్వార్టర్  కంటే 16.54శాతం పెరుగుదలను సాధించింది శ్రీరామ్ పిస్టన్స్.

గత సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం విక్రయాలు  రు. 423.23 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికానికి నెట్ ప్రాఫిట్ రు. 34.89 కోట్లుగా చూపించింది. గత 2017 సెప్టెంబర్  క్వార్టర్‌లో నెట్ ప్రాఫిట్‌ రు. 33.83 కోట్లుగా ఉంది. నెట్ ప్రాఫిట్ పెరుగుదల 3.13శాతంగా ఉంది ఈ సారి. EBITDA గతంలో కంటే  1.31శాతం పెరిగి రు. 79.74 కోట్లుగా ఉంది. అంతే కాకుండా శ్రీరామ్ పిస్టన్స్ EPS రు. 15.60 కి పెరిగింది. ఈ ఫలితాల వెల్లడి తరువాత సోమవారం మార్కెట్లలో శ్రీరామ్ పిస్టన్స్ షేర్ వాల్యూ 0.47శాతం పెరిగి రు.1,195 వద్ద నమోదు అయింది.
 Most Popular