లిక్విడిటీ సమస్యలతో హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు డీలా...!

లిక్విడిటీ సమస్యలతో హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు డీలా...!

హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిళ్ళకు లోనవుతున్నాయి. నగదు లభ్యత కొరత ఎక్కువగా ఉండటంతో హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల స్టాక్స్ పడిపోతున్నాయి. స్టాప్ లాస్ కింద మదుపర్లు తమ షేర్లను అమ్మకానికి పెట్టడంతో ఆయా కౌంటర్లు అమ్మకాల ఒత్తిళ్ళను ఎదర్కొంటున్నాయి. తాజాగా PNB హౌజింగ్ ఫైనాన్స్ స్టాక్స్ 5 శాతం పడిపోయి రు. 827 వద్ద ట్రేడ్ అవుతొంది. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్  షేర్లు 12.23 శాతం నష్టపోయి రు. 203 వద్ద నమోదు అయింది. ఇండియా బుల్స్ హౌజింగ్  షేర్ 8 శాతం నష్టపోయి రు. 800.10 వద్ద నమోదు కాగా, రెప్కో హోమ్ ఫైనాన్స్ 5శాతం పడిపోయి రు. 385 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పతనం మరింత కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. NBFCలకు బ్యాంకులు రుణం ఇచ్చే విషయంలో RBI కొంత నిబంధనలను సడలించినప్పటికి బ్యాంకులు మాత్రం హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రుణాల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. దాంతో ఈ కంపెనీలకు లిక్విడిటీ సమస్యలు ఎదురౌతున్నాయి.


 source of graph: bloomberg quintMost Popular