అమెరికా నుండి అరబిందో మెడిసిన్ అవుట్...

అమెరికా నుండి అరబిందో మెడిసిన్ అవుట్...

అరబిందో ఫార్మాకు ఇబ్బందికరంగా పరిణమించిన ఇర్బెసర్టాన్ ముడి పదార్థాన్ని US మార్కెట్ నుండి ఉపసంహరించుకుంది. అమెరికన్ డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ వెల్లడించిన రిపోర్టుల ప్రకారం మొత్తం 22 బ్యాచ్‌ల ఔషధాల్లో కేన్సర్ కారకాలున్నట్టు USFDA పేర్కొంది. అరబిందో ఫార్మాకు చెందిన ఈ ఇర్బెసర్టాన్ ముడి పదార్ధంలో కూడా N-నైట్రోసోడిథలమైన్ అనే మలినాలు ఉన్నట్టు గుర్తించారు. దీని వల్ల మనుషుల్లో కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇదే మెడిసిన్‌ను అరబిందో ఫార్మా అమెరికాలోని సీజెన్ ఫార్మాకు సరఫరా చేస్తుంది.  ఇర్బెసర్టాన్ ముడిపదార్ధంతో సీజెన్ గుండె జబ్బులు, అధిక రక్తపోటు నివారణకు మెడిసిన్ తయారు చేస్తుంది. అమెరికన్ డ్రగ్ కంట్రోల్ ఆథారిటీ ఇందులో కేన్సర్ కారకాలున్నట్టు తేల్చడంతో ఇర్బెసర్టాన్‌ను అరబిందో మార్కెట్లనుండి ఉపసంహరించుకుంది. కాగా మెయిన్ మెడిసిన్ తయారు చేసే సీజెన్ కూడా తన ఉత్పత్తులను ఉపసంహరించుకోనున్నట్టు తెలిపింది.


 

 Most Popular