PC జ్యూయల్లెర్స్ టాప్... టాటా మోటార్స్ డౌన్

PC జ్యూయల్లెర్స్ టాప్... టాటా మోటార్స్ డౌన్

ఈ పండుగ సీజన్‌లో వాహన రంగం నిరాశ పరచగా, గోల్డ్ , మరియు ఆభరణాల రంగం పురోగతిని సాధించింది. వాహనాల అమ్మకాలు దసరాకు  జోరందుకోలేదు. కానీ.. బంగారు ఆభరణాల విషయంలో మాత్రం డిమాండ్ ఎక్కువగానే కనిపించింది. ధన్ తేరాస్, దివాలి పండుగలు గోల్డ్ డిమాండ్‌ను బానే పెంచాయి.  దివాలీకి మాత్రం వాహన అమ్మకాలు ఇంకా జోరందుకోలేదు. నేటి సోమవారం మార్కెట్లలో PC జ్యూయల్రీస్ స్టాక్స్ 14 శాతం పెరిగి రు. 100.35 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు పెరగడం, పండుగ సీజన్ డిమాండ్ వల్లే ఈ స్టాక్స్ పుంజుకుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక టాటా మోటార్స్ నేటి మార్కెట్‌లో  -0.47శాతం తగ్గి రు. 189.10 వద్ద ట్రేడ్ అవుతోంది.


 Most Popular