అమ్మకానికి SBI నిరర్ధక ఆస్తులు ...

అమ్మకానికి SBI నిరర్ధక ఆస్తులు ...

దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వద్దనున్న మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తుల మీద దృష్టి పెట్టింది. నికర ఆస్తుల విలువ తగ్గిపోతుండటం, డిపాజిట్ల మీద వడ్డీ ఆదాయాలు తగ్గనుండటంతో... తన నిరర్ధక ఆస్తులను (NPA) అమ్మకానికి పెట్టాలని బ్యాంకు నిర్ణయించుకుంది. రు. 1,019 కోట్ల విలువైన NPAలను SBI అమ్మకానికి పెట్టినట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. RBI ... బ్యాంకుల నిరర్ధక ఆస్తులను వదిలించుకోవాలని సూచించడం, మిగతా బ్యాంకులు వీటి విషయంలో సంక్షోభంలో కూరుకుపోవడం, IL&FS వంటి NBFCల్లోని పెట్టుబడుల మీద రిటర్న్న్ రాక పోవడం వంటి కారణాల చేత SBI ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కాగా నేటి సోమవారం మార్కెట్లలో SBI షేరు 1.28 శాతం పుంజుకుని రు. 289.10 వద్ద నమోదు అయింది.
 

 Most Popular