దివాలీ వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి...

దివాలీ వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి...

ఈ సోమవారం నుండి ప్రారంభమయ్యే మార్కెట్ పనిదినాల్లో దివాలీ సందర్భంగా బుధ, గురువారాలు మార్కెట్‌కు సెలవు దినాలే. పండుగ రోజున బుధవారం సాయంత్రం ఓ గంట పాటు మూరత్‌ ట్రేడింగ్ జరగనుంది. అయితే.. ఈ వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి. ఏ ఏ రంగాలు లాభాల్లో, ఏ ఏ రంగాలు నష్టాల్లో ట్రేడ్ అవుతాయో విశ్లేషకులు కొన్ని అంచనాలను వేశారు. అవేంటో చూద్దామా...
* అమెరికా విధించిన ఇరాన్ ముడి చమురు ఆంక్షలతో ఈ వారం మార్కెట్లు కొంత అనిశ్ఛితికి గురి కావొచ్చు.
* అమెరికా , చైనా ట్రేడ్ వార్ అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు
* అమెరికా మధ్యంతర ఎన్నికలు కూడా మార్కెట్లపై ఎఫెక్ట్ చూపనున్నాయి.
* ఈ వారం నిఫ్టీ 10300-10700 మధ్య కదలాడవచ్చు
* మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFCలు లాభాల బాటలో ఉండొచ్చు
* ONGC త్రైమాసిక ఫలితాలు బాగున్నాయి కాబట్టి ఆ షేర్ల ధరలు పుంజుకునే అవకాశం ఉంది.
* ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేయొచ్చని భారత్‌కు అమెరికా ఆంక్షల సడలింపు
* L&T భారీ ఆర్డర్ల కారణంగా ఆ షేర్లు పుంజుకునే అవకాశం
* వచ్చే నెలలో రానున్న ఆర్డర్లతో విద్యుత్ కంపెనీల షేర్లకు ఛాన్స్
* మిశ్రమ ఫలితాల్లో సిమెంట్ రంగ స్టాక్స్
* టెలికాం షేర్లపై మదుపర్ల అనాసక్తి
* ఒత్తిడిలో కొనసాగనున్న టెలికాం రంగ స్టాక్స్
* జియో కొత్త కస్టమర్ల కారణంగా రిలయన్స్ షేర్లు పెరగొచ్చు
* భారతీ ఎయిర్ టెల్, వోడా ఫోన్ వంటి కంపెనీల షేర్ల అమ్మకాల్లో ఒత్తిళ్ళు
* సోమవారం వెలువడనున్న SBI త్రైమాసిక ఫలితాలతో బ్యాంకింగ్ షేర్లు పుంజుకోవచ్చు
* లాభాల బాటలో ఔషధ కంపెనీల షేర్లు
* అమెరికాలో పెరిగిన డాక్టర్ రెడ్డీస్, లుపిన్ కంపెనీల విక్రయాలు
* ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్‌ బరోడా, యూనియన్ బ్యాంక్ షేర్లు పుంజుకోవచ్చు

* మెటల్ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు
* ఉక్కు కంపెనీల సవరించిన ధరల ప్రకారం ఆయా షేర్లు పుంజుకోవచ్చని అంచనా
* మైనింగ్ ఎగుమతుల రంగంలో చైనా ,అమెరికా ట్రేడ్ వార్ ప్రభావం చూపొచ్చు. 

 

Disclaimer:  పైన ఉదహరించిన సూచనలు కేవలం స్టాక్ విశ్లేషకుల అభిప్రాయంగా పరిగణించగలరు. వారి సూచనలను స్టాక్స్ పిక్ చేసుకునే ముందు మరోసారి  పరిశీలించుకోవాల్సిందిగా విజ్ఞప్తి . విశ్లేషకుల అభప్రాయాలను మాత్రమే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఇక్కడ పొందుపరిచింది.Most Popular