బుధవారం ముహూరత్‌ ట్రేడింగ్‌

బుధవారం ముహూరత్‌ ట్రేడింగ్‌

దీపావళి పండుగ సందర్భంగా బుధవారం(7న) దేశీ స్టాక్‌ మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్‌కు బదులుగా ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నారు. అంటే ఆ రోజు ఉదయం ట్రేడింగ్‌ ఉండబోదు. సాయంత్రం 5.30-6.30 మధ్య బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. బలిప్రతిపాద సందర్భంగా గురువారం(8న) బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. తిరిగి శుక్రవారం యథావిధిగా ఉదయం 9.15కు సాధారణ ట్రేడింగ్‌ ప్రారంభంకానుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. మూరత్‌ ట్రేడింగ్‌లో భాగంగా బ్లాక్‌డీల్స్‌, ప్రీసెషన్‌, పోస్ట్‌సెషన్‌తో కలిపి సాయంత్రం 5.15 నుంచి 6.50 వరకూ ట్రేడింగ్‌ జరగనుంది. అయితే 5.30-6.30 మధ్య గంటపాటు సాధారణ ట్రేడింగ్‌ జరగనుంది. Most Popular