సంవత్ 2074 డబుల్ ధమాకా స్టాక్స్ ఇవే

సంవత్ 2074 డబుల్ ధమాకా స్టాక్స్ ఇవే

హిందూ సంవత్సరమైన సంవత్ 2074 (అక్టోబర్ 31, 2018) స్టాక్ మార్కెట్లలో కొంత అనిశ్ఛితినే కనబరిచినా.. కొన్ని స్టాక్స్ మాత్రం గణనీయ లాభాలను తెచ్చిపెట్టాయి. రానున్న దీపావళికి మరో కొత్త సంవత్సరం ఆరంభం కానుంది.

గత సంవత్సరం లాభాలను తెచ్చిపెట్టిన స్టాక్స్ ఇవే.

ఈ సంవత్ 2074లో క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్స్, కెమికల్స్, హెల్త్ కేర్ మరియు IT  రంగాల్లో కొన్ని స్టాక్స్ రెట్టింపు లాభాలను సంపాదించి పెట్టాయి.. మదుపర్లకు. టాప్ గెయినర్స్‌గా కోస్టల్ కార్పోరేషన్ ,2017 నుండి అక్టోబర్‌ 31, 2018 మధ్య కాలంలో... సాధన నైట్రో కెమ్ స్టాక్స్ 1,934 శాతం నుండి 1,599 శాతం లాభాలను ఆర్జించి పెట్టాయి. అలాగే డార్జిలింగ్ రోప్ వే 452 శాతం, ఇండియా బుల్స్ ఇంటిగ్రెటెడ్ సర్వీసెస్ 404 శాతం, మంగళం ఆర్గానిక్స్ 385 శాతం, బుల్లిష్ బాండ్స్ ఎండ్ హోల్డింగ్స్  371శాతం , టియాన్ ఆయుర్వేదిక్ 355 శాతం , దోలత్ ఇన్వెస్ట్‌మెంట్స్ 303 శాతం లాభాలను తెచ్చిపెట్టాయి. గత దీపావళి నుండి BSE సెన్సెక్స్ 6 శాతం పెరగగా, BSE స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 9-17 శాతం పడిపోయాయి. ఇదే సమయంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ అయిన TCS, ఇన్ఫోసిస్, ICICI బ్యాంక్, HUL, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, SBI , L&T, విప్రో , మహీంద్ర&మహీంద్రా వంటి కంపెనీలు బెంచ్ మార్క్ ఇండెక్స్‌ను పడిపోకుండా సపోర్ట్ చేశాయి.
కాగా రూపీ పతనం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణ , అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి వంటి పలు కారణాల వల్ల గత సంవత్సరం మార్కెట్లు పతనం అంచునే పయనించాయి. గత దివాలీ సంవత్‌ లో  GSS ఇన్ఫోటెక్, ఎలక్ట్రోస్టీల్స్ , కంచి కర్పూరం, ఫెయిర్ డీల్ ఫిలమెంట్స్, బిర్లా ప్రెసిషన్, మిస్తీ ఇండియా , HEG, ఎక్సెల్ ఇండస్ట్రీస్, ఉదయ్ జ్యూయల్లరీస్, సాగర్ సాఫ్ట్ వంటి కంపెనీల స్టాక్స్ 200-300 శాతం పెరిగాయి.


మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు...
 ET మార్కెట్.కాం నిర్వహించిన సర్వే , మరియు చాలా మంది స్టాక్ ఎనలిస్టుల అంచనా ప్రకారం రానున్న కొత్త సంవత్సరంలో ఫార్మా, సెలక్ట్ బ్యాంకింగ్, వినియోగ దారుల ఆధారిత రంగంలో, కెమికల్స్, ఇంజనీరింగ్, FMCG  రంగాల స్టాక్స్ గుడ్ రిటర్న్స్ ను ఇవ్వనున్నాయని తెలుస్తుంది.  రానున్న సంవత్సరంలో కార్పోరేట్ బ్యాంకింగ్, ఫార్మా, సెలక్టివ్ కన్జూమర్స్ సెక్టార్లలో లాభాలను చూడొచ్చని టారస్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థకు చెందిన ఫండ్ మేనేజర్ ప్రసన్న పాఠక్ అంచనా వేస్తున్నారు. అలాగే NBFCలు, ఆటో రంగం మరి కాస్త క్షీణించవచ్చని కూడా ఆమె పేర్కొన్నారు.  ప్రసన్న పాఠక్ అంచనాలతో ఆనంద్ రాఠీ సంస్థకు చెందిన  సిద్ధార్ద్ సెడానీ వైస్ ప్రెసిడెంట్, ఈక్విటీ సలహాదారు కూడా ఏకీభవిస్తున్నారు. రానున్న కొత్త సంవత్సరంలో ఆటో ఉపకరణాల తయారీ, కెమికల్స్, ప్రైవేట్ బ్యాంక్స్, వినియోగ ఉత్పత్తుల రంగం లోని స్టాక్స్ మంచి లాభాలను తీసుకురానున్నాయని సిద్ధార్ధ్ అంటున్నారు. ఇక రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ రీసెర్చ్  నవీన్ కులకర్ణీ అంచనాల మేరకు రానున్న కొత్త సంవత్సరంలో NBFCలు నిరుత్సాహ పరుస్తాయని, IT, బ్యాంక్స్ రంగాలు మాత్రం లాభాలను తెచ్చిపెట్టనున్నాయని పేర్కొంటున్నారు. వినియోగ ఉత్పత్తుల రంగం మాత్రం మిశ్రమ ఫలితాలను కనబరుస్తాయని నవీన్ అంటున్నారు.
పంజాబ్ ఆల్కలైన్ , గోదావరి పవర్, బిర్లా కేబుల్, సోరిల్ ఇన్ఫ్రా, మెర్క్, కిలిచ్ డ్రగ్స్, నెల్కో, L&T టెక్నాలజీ, గ్రాఫైట్ ఇండియా, గోల్డ్ స్టోన్ టెక్, విపుల్ ఆర్గానిక్స్, NIIT టెక్నాలజీస్, గ్లోబల్ స్పిరిట్స్,  L&T ఇన్ఫోటెక్, అట్లాస్ జ్యూయల్రీస్, ప్రీతికా ఆటో ఇండస్ట్రీస్, ఉర్జా గ్లోబల్  స్టాక్స్ గత సంవత్సరం మదపర్ల లాభాలను రెట్టింపు చేశాయి.


ఆల్‌ ది బెస్ట్ టు సంవత్‌ 2075
ఈ ఆర్ధిక సంవత్సరంలో పలు మార్కెట్ కరెక్షన్స్ జరిగినా , రానున్న కొత్త సంవత్‌లో పలు కంపెనీల స్టాక్స్ లాభాలను గడించి పెడతాయని మార్కెట్ ఎనలిస్టులు , రీసెర్చ్ ఫోరమ్‌లు  ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ రానున్న దీపావళి మదుపర్ల మోముపై మరిన్ని చిరునవ్వుల లాభాల కాంతులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .