ఈ స్టాక్స్‌పై ఎనలిస్టులకు ఏ మాత్రం నమ్మకం లేదంట ..!

ఈ స్టాక్స్‌పై ఎనలిస్టులకు ఏ మాత్రం నమ్మకం లేదంట ..!

గత రెండు క్వార్టర్లుగా ఎనలిస్టులు నమ్మకం పెట్టుకున్న ఏ స్టాక్‌ కూడా అంచనాలకు చేరుకోలేదు, సరికదా అవి ఇంకా 40-50 శాతం పడిపోవడం కలకలం రేపింది. గత మూడు సంవత్సరాల కాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. రూపీ పతనం, క్రూడ్ ఆయిల్ ధరలు, మనీ మార్కెట్లలో నగదు కొరత వంటి అంశాలు ఆయా స్టాక్స్ ను నిర్వీర్యం చేశాయి. దాదాపు 276 కంపెనీల స్టాక్స్ టార్గెట్ ప్రైజెస్ 70 శాతం కోతకు గురయ్యాయి. అక్టోబర్‌లో నిఫ్టీ 50 ఇండెక్స్  బెంచ్‌ మార్క్ రెండు నెలల గరిష్టానికి పడిపోడంతో, ఎనలిస్టుల టార్గెట్ అంచనాలు తలకిందులయ్యాయి. గత నెల నిఫ్టీ బెంచ్ మార్క్ 4.98శాతం పతనమైంది. NBFCల సంక్షోభం కూడా దీనికి కారణంగా నిలిచింది. IL&FS పతనం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నగదు కొరత వంటి అంశాలు మార్కెట్‌ను గణనీయంగా ప్రభావితం చేశాయి.


దాదాపు 195 స్టాక్స్ విషయంలో అంచనా ధరలు తారుమారయ్యాయి. ఎనలిస్టులు ఎంతో నమ్మకం పెట్టుకున్న డిష్ టీవీ ఇండియా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. దేశంలోనే అతి పెద్ద డైరెక్ట్ టు హోమ్ నెట్ వర్క్ కలిగిన డిష్ టీవీ అంచనాలపై  40శాతం కోతకు గురైంది. డిష్ టీవీ షేర్ కుదేలు కావడానికి  మరో పోటీ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకాం  వేగవంతంగా దూసుకుపోవడం కూడా ఒక కారణంగా ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇదే కాకుండా మూడు రాష్ట్రాల ఆధ్వర్యంలో నడిచే ఆయిల్ కంపెనీల స్టాక్స్, ఆరు ఫైనాన్షియల్ స్టాక్స్  అంచనా ధరలను అందుకోలేక 19-39 శాతం పతనమయ్యాయి.

డిష్ టీవీ ఇండియా             -40.0 శాతం,
హిందుస్థాన్ పెట్రోలియం       -38.4 శాతం
భారత్ పెట్రోలియం              -31.3 శాతం
DB గ్రూప్                         -26.8 శాతం
ఇండియా ఆయిల్               -25.9 శాతం
కెన్ ఫిన్ హోమ్స్                 -24.5 శాతం

ఎస్ బ్యాంక్                        -24.3 శాతం
IDFC బ్యాంక్                    -23.1 శాతం
దివాన్ హౌజింగ్                 -22.5 శాతం

అంచనాలను అందుకున్న స్టాక్స్ ఇవే...
ఎనలిస్టుల టార్గెట్ ప్రైజ్‌ను అందుకున్నవి మొత్తం మీద కేవలం 71 కంపెనీలు మాత్రమే. టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో మాత్రమే అంచనాలను అందుకున్న స్టాక్స్ ఉన్నాయి. NIIT టెక్నాలజీస్ 14శాతం అధికంగా అంచనాలను మించగా, V -మార్ట్ రిటైల్ మిగతా కంపెనీల కంటే అత్యధికంగా టార్గెట్‌ను రీచ్ అయింది.

NIIT టెక్నాలజీస్      13.9 శాతం
V-మార్ట్ రిటైల్           11.4 శాతం
దివీస్ ల్యాబ్స్            10.5 శాతం

డా. రెడ్డీస్                  7.6 శాతం
ఇన్ఫో ఎడ్జ్ ఇండియా     7.2 శాతం
TCS                        6.9 శాతం
ఇన్ఫోసిస్                   6.8 శాతం
విప్రో                         6.8 శాతం

గత సెప్టెంబర్ మాసాంతానికి ICICI బ్యాంక్, మారుతీ సుజుకీ , మైండ్ ట్రీ లిమిటెడ్, వంటి కంపెనీల స్టాక్స్ కూడా ఎనలిస్టులను నిరాశ పరిచాయి.  వీటికి రేటింగ్ సంస్థలు 'బై రేటింగ్స్' 5 -7 వరకూ ఇచ్చినా ఇవి ఆశాజనక ఫలితాలను ఇవ్వలేక పోయాయి.      Most Popular